| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | పంచమాశ్వాసము |
| దిక్పతు లొక్కుమ్మడి శ్రీకృష్ణుని దాఁకుట | ||
| చ. |
అనలుఁడు రెండు, మూఁడు యముఁ, డాసురనాథుఁడునాలు, గైదు తో యనిధిపుఁ, డాఱు గంధవహుఁ, డర్థపుఁ డేడు, మహేశుఁ డెన్మిది\న్ ఘనవిశిఖంబు లేయ మురఘస్మరుఁ డన్నియుఁ ద్రుంచి శార్ఙ్గ సం జనిత మహోగ్రభల్లముల జర్జరితాంగులఁ జేసె నందఱ\న్. |
22 |
| ఆ. |
వేల్పుమ్రానియందు వేడుకపడు కూర్మి సతుల కోర్కిఁ దీర్పఁ జాలి యపుడు హరియు హరియుఁ బోరి రన్యోన్య జయకాంక్ష నసుర జీవనాపహాశుగముల. |
23 |