| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | పంచమాశ్వాసము |
| పారిపోవుచున్న దిక్పతుల నింద్రుఁ డదలించుట | ||
| చ. |
హరిహయుఁ డాగ్ర హోజ్జ్వలితుఁ డై యనిఁ బాఱు దిశానాథుల\న్ దిరుగుఁడు పోకు పోకుఁడని తిట్టి యదల్చి నవోదయ త్పయో ధరము నలంకరించు తన ధన్వ మధిజ్యము చేసి గోత్రభీ కరముగ బాహులెత్తి తమకంబున సేనకుఁ జేయివీచిన\న్. |
14 |
| క. |
గిరితటముఁ దాకి తిరిగెడు తరంగిణియుఁ బోలె దేవతాపతి యాజ్ఞ\న్ మరలి వియచ్చర వాహిని మురహరునిం బొదివి ఘోరముగఁ బోరునెడ\న్. |
15 |