| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | చతుర్థాశ్వాసము |
| ఇంద్రపురి సమర సన్నాహములు | ||
| ఉ. |
కోణపరంప రాహతులఁ గూరిన వేదననో సమస్త ని ర్మాణ భృతి ప్రణాశకరు మాధవునిం జెనకంగఁబోవు గీ ర్వాణులఁ బోకుఁడంచు మొఱవైచెనొకో! యన మ్రోసె నంత ని స్సాణము పాకశాసను హజారమునం గదనాభిశంసి యై. |
64 |
| మ. |
అపు డాబద్ధ ఖలీన కాశ్వచయ మై, యందూ పరిభ్రంశిత ద్విప మై, దివ్యర థాగ్ర కేతు పటసంథిత్సా మిళ త్సూత మై, యపరాభూత భుజావలేప భట వీరాలాపమై, జంభవై రిపురం బంతయు మందర క్షుభిత వార్ధింబోలె ఘూర్ణిల్లుచు\న్. |
65 |
| ఉ. |
నీయనుజన్ముఁడ న్సఖుఁడ నీకని యింటికి వచ్చి జంభదై తేయవిరోధిచే నపుడు తేజము లన్నియుఁ గాంచి చేసె న న్యాయము పారిజాతహరణంబునఁ గృష్ణుఁడు మంచిచుట్ట మౌ రా! యని పల్కఁగా జనపరంపచే విని రెల్లవారలు\న్. |
66 |