| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | చతుర్థాశ్వాసము |
| ఇంద్రుఁడు రౌద్రాకృతిఁ దాల్చుట | ||
| శా. |
ఆ మాటల్విని పాకశాసనుఁడు రౌద్రాకారుఁడై పేర్చి యే మేమీ కృష్ణుఁడు మందలో బలెనె తా నింద్ర ద్రు మోత్పాటనం బీమై నిచ్చటఁ జూపవచ్చె; నిది మేలే; తార్క్ష్యుఁడైన న్మదీ యామోఘాశని పాత మిట్టిదని యాహా! తెల్పఁడాయెం జుమీ. |
61 |
| మ. |
అని పౌలోమి మొగంబుఁజూచి వినుమో యబ్జాస్య! నీకింతమా త్రన విన్నంబడ నేల? పోదు నిదె సత్యా గర్వభంగంబు ది వ్య నగంబు న్విడిపించి వత్తునని సాహంకారుఁడై లేచి చ య్యన శుద్ధాంతగృహంబు వెల్వడి సుధర్మాస్థాన మధ్యస్థుఁడై. |
62 |
| ఉ. |
తానఁటె పారిజాత వసుధారుహముం గొనిపోవువాఁడు, క న్గానఁడు యాదవుం డనుచుఁ గన్నులు వేయులు జేవుఱింప వై శ్వానర ధర్మ దైత్యవర వారిధిపానిల యక్షనాయ కే శానుల దిక్కుచూచి కులిశంబు కరంబునఁ బూఁచి పట్టిన\న్. |
63 |