| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | చతుర్థాశ్వాసము |
| ఉదయ సూర్య ప్రస్తుతి | ||
| సీ. |
మొగుడుఁ దమ్ములఁ జిక్కు మగతేఁటి యలుఁగులు - సడలిపోఁ జేయు విశల్యకరణి, కాలవశంబునఁ గడచన్న వాసర - శ్రీఁ గ్రమ్మఱించు సంజీవకరణి, రే యను వాలునఁ బాయలైన రథాంగ - తతుల హత్తించు సంధానకరణి, తిమిరంబుచే సొంపు సమసిన దిశలకు - వన్నియ నొసఁగు సౌవర్ణకరణి, |
|
| తే. |
మించు బీరెండయగ్నిఁ బుట్టించు సరణి, కలుష ఘోర పయోరాశిఁ గడపు తరణి, తోఁచెఁ బ్రాచీ మహీధరోత్తుంగ సరణిఁ బ్రాఁజదువు మానికంబుల బరణి, తరణి. |
49 |