| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | చతుర్థాశ్వాసము |
| సంధ్యాకాల వర్ణనము | ||
| క. |
దిన రా జత్తఱిఁ బంకజ వనములఁ జరియించు కాంతివర్గము దాను\న్ వనధి జనకేళి సలుపఁగఁ జనియె నన న్వారుణీ దిశా తటిఁ బొల్చె\న్. |
42 |
| తే. |
వేల్పుఁ జిగురాకుఁబోఁడుల వీఁగుఁజన్నుఁ గవలపైఁ గుంకుమచ్ఛాయ గడలు కొలిపి పసిఁడిగట్టున కొకవింత మిసిమి నించి నెఱసెఁ గడసావి ముదుసలి తెఱప యెండ. |
43 |
| ఆ. |
వేల్పుగట్టు గవుల వెలువడి వడదేఱఁ జదలు వాఁక నీట జలక మాడి వైజయంత హర్మ్య వలభి నీడంబులఁ గ్రందుకొనియెఁ గిన్నర ద్వయములు. |
44 |
| క. |
ఘన సాంధ్యరాగ వినతా తనయ గరు త్సమితి కడిఁది తాఁకువ ధర వ్రా లిన గగన ఫణి ఫణామణి యన రవిమండలము పశ్చిమాంబుధిఁ గ్రుంకె\న్. |
45 |