| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | తృతీయాశ్వాసము |
| దేవమాత యదితిని శ్రీకృష్ణుఁడు దర్శించుట | ||
| సీ. |
తొడలపైఁ జాఁచిన యడూగుఁ గెందామర - లొయ్యనఁ బౌలోమి యెత్తుచుండఁ, బార్శ్వభాగంబునఁ బంకేరుహాసను - కామినీరత్నంబు కతలు సెప్పఁ, బనిఁ బూని యంతంత వినయావనత వృత్తి - సప్తర్షికాంతలు సంచరింప, వీజన చామర వీటీకరండాది - కములు దిక్పతిసతీ గణము దాల్ప, |
|
| తే. |
విమల చింతామణీమయ వేదిమీఁదఁ గల్పక లతాంత కల్పిత తల్పసీమ నధివసించిన నిఖిల లోకైకవంద్య నమర మౌక్తిక శుక్తి నయ్యదితిఁ గనియె. |
24 |
| మ. |
కని సత్యారమణీ యుతంబుగ నమస్కారంబు గావించి భౌ మ నిశా టాహృత కుండలద్వయము నాత్మ స్వర్ణచేలాగ్ర బం ధనము న్వీడ్చి యొసంగ నందుకొని మోదంబంది యా నందనం దను దీవించుచుఁ జెంగట న్నిలిపెఁ జింతారత్న పీఠంబున\న్. |
25 |