| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | ద్వితీయాశ్వాసము |
| వేగుచుక్క వర్ణనము | ||
| మ. |
నలినాప్తుండు మదీయ బంధులను తా నక్షత్ర సంఘంబులం గలఁప న్వచ్చుచు నున్న వాఁ డనుచు మున్గల్గంగ నాత్మీయ శి ష్యుల మందేహులఁ బోరొనర్పఁ జనుఁడంచుం బంపి యేతెంచెనాఁ బొడమె న్వేగురుఁ జుక్క కాలఫణ భృద్భోగోల్లస ద్రత్నమై. |
54 |
| క. |
వైతాళికు లప్పుడు మృదు గీతామృత వచన రచన గీలుకొన యశో దా తనయు మేల్కొలుపఁ బ్రా భాతిక రమణీయ రాగ ఫణితులు సెలఁగె\న్. |
55 |