| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | ద్వితీయాశ్వాసము |
| పారిజాతాపహరణము - ద్వితీయాశ్వాసము | ||
| క. |
శ్రీ సదన లోచనాబ్జ ద యా సార మరంద పోషితార్థి భ్రమరో ల్లాసగుణ! మలయకూట ప్రాసాద నివేశ! కృష్ణరాయ మహీశా! |
1 |
| తే. |
అవధరింపుము జనమేజయ క్షితీశ వరున కిట్లను నమ్మౌని వల్లభుండు పారిజాతంబుఁ దే నిట్లు ప్రతిన వల్కి చంద్రశాలకు నేతెంచి చక్రధరుఁడు. |
2 |