| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | ప్రథమాశ్వాసము |
| ఆశ్వాసాంతము | ||
| మ. |
దయమానాక్షివిలోక! లోక హితకృత్ప్రారంభ! రంభా కుచ ద్వయ దుర్గాధిపతి ద్విషత్పఠిత గాథా వ్యక్త దోస్సార! సా రయశ స్సాంద్ర దిశాంత! శాంత హృదయారజ్యన్న యాచార! చా రయుతోపాయ విచార! చారణ గణ ప్రస్తూయమానోదయా! |
138 |
| క. |
ప్రతివర్ష వసంతోత్సవ కుతుకాగత సుకవి నికర గుంభిత కావ్య స్మృతి రోమాంచ విశంకిత చతురాంతఃపుర వధూ ప్రసాదన రసికా! |
139 |
| నర్కుటము. |
ప్రసృతి విలోచనా కుసుమబాణ! దిశా లలనా ఘుసృణ పటీర లేపకృతి కోవిద! బాహుతటీ విసృమర కీర్తిజాల! రణ వీక్షిత వైరినృప త్యసృగతి పంకిలాసిముఖ! యైందవ వంశ మణీ! |
140 |
| గద్యము. |
ఇది శ్రీమదుమామహేశ్వర వర ప్రసాద లబ్ధ సార సారస్వతాభినంది నంది సింగయామాత్య పుత్త్ర కౌశిక గోత్ర పవిత్ర సుజన విధేయ తిమ్మయ నామధేయ ప్రణీతంబైన పారిజాతాపహరణంబను మహా ప్రబంధమునందుఁ బ్రథమాశ్వాసము. |
|