| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | ప్రథమాశ్వాసము |
| సత్య విలాప మోహనత | ||
| ఉ. |
ఈసున బుట్టి డెందమున హెచ్చిన శోక దవానలంబుచేఁ గాసిలి యేడ్చె ప్రాణ విభు కట్టెదుటన్ లలితాంగి పంకజ శ్రీ సఖమైన మోము పయి చేల చెఱంగిడి బాలపల్లవ గ్రాస కషాయకంఠ కలకంఠ వధూ కల కాకలీ ధ్వనిన్ |
133 |
| ఉ. |
ఆ రమణీ లలామ మదినంటిన కోపభరంబు నిల్పఁగా నేరక నెవ్వగం బొగుల నీరజ నాభుఁడు నిండు కౌఁగిటం జేరిచి బుజ్జగించి నునుఁ జెక్కుల జాలుకొనంగ జాఱు క న్నీరు కరంబునం దుడిచి నెయ్యము తియ్యము దోఁప యిట్లనెన్ |
134 |