| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | ప్రథమాశ్వాసము |
| కోప వివశయై సత్య శ్రీకృష్ణుని బరుషోక్తులాడుట | ||
| ఉ. |
ఈ నయగారపుం బ్రియములీ పస లీ మెర మెచ్చు మాటలే లా నిను నమ్మి యుండిన ఫలంబిదె తోడన నాకు గల్గె నీ యాన జుమా ననుంజెనకి యాఱడి బెట్టిన నవ్వు వారలం గాన వెఱుంగునే పసుల కాపరి భావజ మర్మ కర్మముల్? |
125 |
| ఉ. |
ఇంకిటు నిన్ను నమ్మ నను యేమిటికిం కెరలించె దెంతయున్ పొంకము కాని నీ వలని బొంకులు మా చవి గావు రుక్మిణీ పంకజ పత్ర నేత్రకును ప్రాణ పదంబులు గాని వల్లకీ కింకర చాలుజాలు యుడికింపకు నింపకు లేని కూరుముల్ |
126 |
| ఉ. |
గట్టివ చేతలుం పసలు కల్లతనంబులు నీవు పుట్టఁగాఁ బుట్టినవెందు లేని పలు పోకల మాయలు నీకు వెన్నతో పెట్టినవౌ టెఱింగియును బేల తనంబున నిన్ను నమ్మి నా గుట్టును తేజమున్ మిగుల కోల్పడి పోయితినేమి జేయుదున్ |
127 |
| చ. |
మునిపతి వచ్చి పూవొసఁగి మోదము తోడ భవత్ప్రియాంగనన్ వినుతి యొనర్పఁగా వినిన వీనులు మా చవిగాని మాటలన్ విన వలసెంగదా యిపుడు నీవిట వచ్చుట పారిజాత వా సన ప్రకటించి నాకు నెకసక్కెము చేయన కాదె జెప్పుమా? |
128 |
| క. |
మానంబె తొడవు సతులకు మానమె ప్రాణాధికంబు మానమఖిల స మ్మానములకు మూలంబగు మాన రహితమైన బ్రతుకు మానిని కేలా? |
129 |
| తే. |
తనదు కోడండ్రలోనఁ బెద్దయుఁగ నన్ను దేవకీ దేవి మన్నించు; నీవు నాకుఁ జనవు లిచ్చుటఁజేసి; యా సాధ్వి సేవ సేయఁ బోవంగ నా కింక సిగ్గు కాదె! |
130 |
| సీ. |
ఉవిద యెవ్వతె నోఁచి యున్నదో! యీ శమం - తక రత్న మింక నౌఁదల ధరింప? నీ రైవతక శైల చారు కూట విటంక - కేళి కిం కెవ్వతె పాలుపడునొ? యెవ్వతె కబ్బునో! యీ వసంతారామ - కర్పూర కదళి కాగార వసతి? లీల నీ మణి సౌధ జాలకంబుల నిన్నుఁ - గూడి యెవ్వతె వార్ధిఁ జూడఁ గలదొ? |
|
| తే. |
యకట! నేఁ బెంపఁ బెరిఁగిన శుక మయూర శారికా బృంద మెవ్వతెఁ జేరునొక్కొ! నన్ను నాతోడి సవతులు నగక మున్న పంత మలరంగ నిన్ను మెప్పింతుఁ గాన |
131 |
| క. |
నను యెవ్వతె గాఁ జూచితి వని యంతర్బాష్ప యగుచు యవనత ముఖియై ఘనతర గద్గదికా ని స్వనమున మఱి మాటలాడ శక్యము కామిన్ |
132 |