| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | ప్రథమాశ్వాసము |
| కృష్ణుఁడు పారిజాతమును రుక్మిణి కొసఁగుట | ||
| చ. |
కనుగవఁ బిన్న నవ్వు దొలఁక, న్మునినాథుని కన్ను సన్న ని చ్చినఁ, దగ భోజనందనయుఁ జేకొని మౌనికి మ్రొక్కి యవ్విరిం దన నెఱి గొప్పునం జెరివిన న్వలిగుబ్బలి ముద్దుపట్టి లేఁ త నెల ధరించిన ట్లమరెఁ దద్దయు మోహన కాంతి సంపదన్ |
55 |
| సీ. |
మగమీల నగఁజాలు తెగఁ గీలుకొను వాలుఁ - గనుఁగవ కొక వింత కాంతి యొదవె, వలిజక్కువల పెక్కువలు దక్కువగ నిక్కు - చనుదోయి కొక వింతచాయ దోఁచె, నెల తుమ్మెదల దిమ్ము వెలిఁజిమ్ము చెలువమ్ము - గల వేణి కొక వింత నలుపు మీఱె, నల చెందొవల విందు చెలువెందు వెద చిందు - మొగమున కొక వింత జిగి దొలంకెఁ, |
|
| తే. |
జక్కఁదనమున కొక వింత చక్కఁదనము, జవ్వనంబున కొక వింత జవ్వనంబు, విభ్రమంబున కొక వింత విభ్రమంబు గలిగె నద్దివ్య కుసుమంబు కతన సతికి |
56 |
| క. |
కలకంఠకంఠి యీగతిఁ బులుగడిగిన ముత్తియంపుఁ బొలుపొందంగా నెల నవ్వొలయఁగఁ బలికెను జలజాసను పట్టి కలహ సంభ్రమ పరుఁడై |
57 |