| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | ప్రథమాశ్వాసము |
| నారదాగమన వర్ణనము | ||
| సీ. |
స రి గ మ ప ధ ని స సంజ్ఞస్వరంబుల - మహతి నభో వాయు నిహతి మొఱయ, భాగీరథీ పయః పరిపూర్ణ మణి కమం - డలువు హస్తంబునఁ జెలువు మిగులఁ, బ్రణవ మంత్రావృత్తి పావన స్ఫటికాక్ష - వలయంబు కర్ణ శష్కులిక వ్రేల, సమర నృత్యోచిత చమరవాలంబును - గక్షపాలయు భుజాగ్రమున మొఱయ, |
|
| తే. |
దేహకాంతు లకాల చంద్రికల నీన, జడలు మోక్షద్రుపల్లవ శంక సేయ, గగనమున నుండి వచ్చె నాకస్మికముగ నారివేరంపుఁ దపసి దైత్యారికడకు. |
44 |