| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | అవతారిక |
| పారిజాతాపహరణము - అవతారిక | ||
| ఇష్టదేవతా స్తుతి | ||
| ఉ. |
శ్రీమదికిం బ్రియం బెసఁగఁ జేర్చిన యుయ్యెల లీల వైజయం తీ మిళితాచ్ఛ కౌస్తుభము నిద్దపుఁ గాంతిఁ దనర్చి యాత్మ వ క్షోమణి వేదిఁ బొల్పెసఁగఁ జూడ్కుల పండువు సేయు వేంకట స్వామి కృతార్థుఁ జేయు నరస క్షితినాథుని కృష్ణరాయనిన్. |
1 |
| మ. |
పొలఁతుల్ కౌఁగిటఁ గ్రుచ్చి యెత్తి తలఁబ్రా ల్వోయించు నవ్వేళ నౌఁ దల గంగం దన నీడఁ దాన కని మౌగ్ధ్యం బొప్ప వేఱొక్క తొ య్యలి యంచున్మది నెంచు పార్వతి యసూయావాప్తికిన్నవ్వు క్రొ న్నెలపూఁ దాలుపు కృష్ణరాయనికి సంధించు న్మహైశ్వర్యముల్. |
2 |
| మ. |
తన దంతాగ్రముచేతఁ దీక్ష్ణమతి, నుద్య త్కుంభయుగ్మంబుచే త నితాంతోన్నతి, దాన విస్ఫురణ నుత్సాహంబు, శుండా ముఖం బున దీర్ఘాయువు నిచ్చుఁ గావుత గుణాంభోరాశికిం గృష్ణరా యనికి న్వారణ రాజ వక్త్రుఁడు కృపాయత్తైక చిత్తాబ్జుఁడై. |
3 |
| చ. |
సరసపు టల్కఁ దీర్చుతఱి శార్ఙ్గ సుదర్శన నంద కాబ్జ సం భరణ గుణాప్తి నెన్నడుముపైఁ గటిపై జడపై గళంబుపై హరి నలుగేలుఁ బైకొన సుఖాంబుధి నిచ్చలు నోలలాడు నిం దిర కృపఁ జూచుఁ గాత నరదేవ శిఖామణిఁ గృష్ణరాయనిన్. |
4 |
| చ. |
తన మృదు గీతికా పరిణత ధ్వని వైఖరిఁ బల్కు మంచు నిం చిన రహిఁ జేతివీణియకుఁ జెక్కులు గీఁటుచు నేర్పుచున్నదో యన నఖరాంకురంబుల నయమ్మునఁ దంత్రులు మీటి గాన మిం పొనరఁగఁ జేయు వాణి ప్రతిభోన్నతుఁ జేయుతఁ గృష్ణరాయనిన్. |
5 |
| చ. |
వలిమల యల్లువాఁడు తలవాఁక ధరించిన పూవుగుత్తి, వే ల్పులగమి జీవగఱ్ఱ, యుడివోవని చల్వల టెంకి, వెన్నెల ల్మొలచిన పాదు, పాల్కడలి ముద్దులపట్టి నృసింహ కృష్ణరా యలఁ గరుణారసంబు నినుపారెడి చూపులఁ జూచుఁ గావుతన్ |
6 |