| భాష | ఛందస్సు | సులక్షణసారము |
| 4. వృత్తములు | ||
| క. |
సమవృత్తములఁ జతుష్పా దములం దొక్క క్షరము మొ - దలుగాఁ బెరుగన్ గ్రమముగ గణాక్షరంబులు సమమౌ మఱి యిరువదాఱు - ఛందంబులకున్. (భీమన ఛందము) |
35 |
| 4.1. ఉత్పలమాలావృత్తము | ||
| . |
భానుసమాన! విన్, భరన - భారలగంబులఁ గూడి విశ్రమ స్థానమునందుఁ బద్మజయు - తంబుగ నుత్పలమాలయై చనున్. (భీమన ఛందము) |
36 |
| 4.2. చంపకమాలావృత్తము | ||
| . |
నజభజజల్ జరేఫలఁ బె - నంగి దిశాయతి తోడఁ గూడినన్ ద్రిజగ దభీష్టదా బుధని - ధీ విను చంపకమాలయై చను\న్. (భీమన ఛందము) |
37 |
| 4.3. శార్దూల విక్రీడిత వృత్తము | ||
| . |
సారాచార విశారదా! యినయతి\న్ - శార్దూల విక్రీడితా కారంబై మసజమ్ము లిమ్ముగ సతా - గ ప్రాప్తమై చెల్వగు\న్. (భీమన ఛందము) |
38 |
| 4.4. మత్తేభ విక్రీడితము | ||
| . |
స్మయదురా! విలసత్ప్రయోదశయతి\న్ - మత్తేభ విక్రీడితా హ్వయమయ్యె\న్ సభరంబులు\న్ సమయవ - వ్రాతంబులుం గూడఁగా\న్ (భీమన ఛందము) |
39 |
| 4.5. మత్తకోకిల | ||
| . |
శ్రావకాభరణాంక! వి\న్, రస - జాభ రేఫల దిగ్విరా మావహంబుగ మత్తకోకిల - మండ్రు దీని\న్ గవీశ్వరుల్ (భీమన ఛందము) |
40 |
| 4.6. ధ్రువకోకిల (తరలము) | ||
| . |
శుభవిలాస! ముకుంద! కేశవ! - శూలిభవ్య విరామము\న్ న, భ, ర, సంబులు, జాగముల్ దగు - నవ్యమై ధ్రువకోకిల\న్ |
41 |
| 4.7. పృథ్వి | ||
| . |
త్రయోదశయతి\న్ గృతి\న్ జ,స,జ,సల్,జ - తంబై య, వల్ దయాజలనిధీ! చెలంగు విను పృథ్వి - ధాత్రిం దగన్. |
42 |
| 4.8. సరసాంకము | ||
| . |
సరసాంక వృత్త మమరు\న్ - స, జ, సా, య లొంద\న్ సరసీజ సంభవయతి\న్ - జలజాత నేత్రా! |
43 |
| 4.9. స్రగ్ధర | ||
| . |
శ్రీమన్మూర్తీ మకారా - శ్రిత ర, భ, న, య, యా - సేవ్యమై సానుమద్వి శ్రామంబు\న్ సానుమద్వి - శ్రమము నమరఁగా - స్రగ్ధరావృత్తమయ్యె\న్. (భీమన ఛందము) |
44 |
| 4.10. మహాస్రగ్ధర | ||
| . |
లసదుద్యత్కీర్తి వల్లీ - లలిత గుణగణా - లంకృతాంగా స, తా, న స్థ స, రా, గంబు ల్మహాస్ర - గ్ధరకు వసుముని - స్థానవిశ్రాంతులొప్ప\న్. (భీమన ఛందము) |
45 |
| 4.11. స్రగ్విణీ | ||
| . |
వాగ్వధూవల్లభా! - వార్ధి రేఫావళి\న్ స్రగ్విణీవృత్త వి - శ్రాంతి యాఱింటిపై. (భీమన ఛందము) |
46 |
| 4.12. భుజంగ ప్రయాతము | ||
| . |
జగద్గీతకీర్తి! భు - జంగ ప్రయాతం బగు\న్ రేచనా! యద్వ - యద్వంద్వమైన\న్. (భీమన ఛందము) |
47 |
| 4.13. తోవకము | ||
| . |
శ్రీయుత భత్రయ - సేవ్యగగంబుల్ తోయజలోచన! - తోవకమయ్యె\న్. (భీమన ఛందము) |
48 |
| 4.14. పాదపము | ||
| . |
పాదపవృత్తము - భా భగగంబుల్ మోదముతో నిరు - మూఁటవిరామన్. |
49 |
| 4.15. తోటకము | ||
| . |
తుదిదాఁక సకారచ - తుష్కముగా విదితంబుగఁ దోటక - వృత్తమగు\న్. (భీమన ఛందము) |
50 |
| 4.16. తోదకము | ||
| . |
జలరుహవక్త్ర! న, - జా, యగణంబుల్ వెలయగఁ దోదక - వృత్తముఁ జెప్పు\న్. (భీమన ఛందము) |
51 |
| 4.17. వసంతతిలకము | ||
| . |
సారంబుగా త, భ, జ, - జంబు వసంతరాజా కావా! వసంత తిల - కంబగు గాయుతంబై. (భీమన ఛందము) |
52 |
| 4.18. మదన | ||
| . |
దైతేయభంజన! హరీ! - త, భ, జా, గగంబుల్ మాతంగ విశ్రమము\న్ - మదనాఖ్యయొప్పు\న్. |
53 |
| 4.19. పంచచామరము | ||
| . |
జరల్ జరల్ జగంబుగూఁడ - సన్నుతి\న్ రచింపఁగాఁ బరాజితారిధీరవీర! - పంచచామరంబగు\న్. |
54 |
| 4.20. సుగంధి | ||
| . |
ఏడుహమ్ములున్గము\న్ వ - డెన్మిది\న్ సుగంధికి\న్. (చిత్రకవి పెద్దన) |
55 |
| 4.21. తరళము | ||
| . |
న, న, న, న, న, న, న, గము లెలమి - నలినహితవిరమణత\న్ దనరి తరళ మనఁగ వెలయు - ధరణి మదన మదహరా! |
56 |
| 4.22. మాలిని | ||
| . |
న, న, మ, య, య యుతంబై - నాగవిశ్రాంతమై యి ట్లనుపమగుణ! మాలి - న్యాహ్వయంబయ్యెధాత్రిన్. (భీమన ఛందము) |
57 |
| 4.23. మానిని | ||
| . |
కారకముల్ క్రియ - గన్గొన నేడు భ - కారము లొక్కగ - కారముతో గారవమై చనఁ - గా వళులన్నియుఁ - గల్గిన మానిని - కామనిభా! (భీమన ఛందము) |
58 |
| 4.24. కవిరాజ విరాజితము | ||
| . |
క్రమమున నొక్క న - కారము నాఱు జ - కారములుం బరఁ - గంగ నకా రమును నొడంబడి - రాఁ గవిరాజ వి - రాజిత మన్నది - రామనిభా! (భీమన ఛందము) |
59 |
| 4.25. తరలి | ||
| . |
చారు భ, స, న, భూరి జ, న, ర, - సాంద్రగణముల\న్ దిశా సార విరతి నందముగ ని - జంబు తరలి చెన్నగు\న్. |
60 |
| 4.26. శిఖరిణి | ||
| . |
పురారాతి స్పర్ధీ! యమనసభవం - బుల్పెనఁగి సుం దరంబైన\న్ రేచా! శిఖరిణియగు\న్ - ద్వాదశయతి\న్. (భీమన ఛందము) |
61 |
| 4.27. ఇంద్రవజ్ర | ||
| . |
ఇత్తా, జ, గా సంగతి - నింద్రవజ్రా వృత్తంబగు\న్ సన్నుత - వృత్తరేచా! (భీమన ఛందము) |
62 |
| 4.28. ఉపేంద్రవజ్ర | ||
| . |
సపద్మ పద్మా! జత - జల్గగంబు\న్ ఉపేంద్ర వజ్రాఖ్యము - నొప్పుఁజెప్ప\న్. (భీమన ఛందము) |
63 |
| 4.29. ఉపజాతి | ||
| . |
ఈ రెండు వృత్తంబులు - నిందుఁగూడ\న్ సరోజనేత్రా! యుప - జాతి యయ్యె\న్. (భీమన ఛందము) |
64 |
| 4.30. మందాక్రాంత | ||
| . |
కాంతా కాంతా! మభనతతగా - కాంతి సంక్రాంతి మందా క్రాంతంబయ్యెన్ విరతి దశమా - క్రాంతి విశ్రాంతమైనన్. (భీమన ఛందము) |
65 |
| 4.31. రథోద్ధత | ||
| . |
నందితప్రయర - నంబుపై రవం బొంది వచ్చిన ర - థోద్ధతంబగున్. (భీమన ఛందము) |
66 |
| 4.32. స్వాగతము | ||
| . |
స్వాగతంబగు ల - సద్గుణ లక్ష్మీ భాగభోగి! ర, న, - భల్, గగయుక్తి\న్. (భీమన ఛందము) |
67 |
| 4.33. వంశస్థము | ||
| . |
సముజ్జ్వలాంగా! జ, త, - జంబు, రేఫతో నమర్పవంశస్థ స - మాహ్వయంబగున్. (భీమన ఛందము) |
68 |
| 4.34. ఇంద్రవంశము | ||
| . |
సన్మానధారీ! తత - జంబు రేఫతో విన్మింద్రవంశాహ్వయ - వృత్తమైచనున్. (భీమన ఛందము) |
69 |
| 4.35. మేఘవిస్ఫూర్జితము | ||
| . |
రమానాథు న్నాథు\న్ యదుకులశిరో - రమ్యరత్నాయమానున్ సముద్యత్తేజిష్ణు\న్ దనుజయువతి - స్ఫారధైర్యాపహారు\న్ మిముంబ్రీతిం బేర్కొంద్రరుణవిరతిన్ - మేఘవిస్ఫూర్జితాఖ్యన్ గ్రమ్మంబొప్పన్ బెద్దల్ యమనసములున్ - రాగముల్ గా ముకుందా! (అనంతుని ఛందము) |
70 |
| 4.36. భద్రకము | ||
| . |
విద్రుమాభ! రసంబువన్ భద్రకంబు ధరిత్రిపై. |
71 |
| 4.37. మణిరంగ | ||
| . |
శ్రీరసద్వయ - సేవ్యగకారా ధారమైనది - దా మణిరంగన్. |
72 |
| 4.38. వనమయూరము | ||
| . |
ఉన్నతములై వనమ - యూరకృతులోలిన్ ఎన్నఁగ భజంబుల ప - యిన్ స, న, గగంబుల్ చెన్నొదవ దంతియతి - చెందియలరారన్ వెన్నుని నుతింతురు వి - వేకు లతిభక్తిన్. (అనంతుని ఛందము) |
73 |
| 4.39. విద్యున్మాల | ||
| . |
ఉద్యన్మాగా - యుక్తంబైనన్ విద్యున్మాలా - వృత్తంబయ్యెన్. (భీమన ఛందము) |
74 |
| 4.40. ద్రుతవిలంబిత | ||
| . |
ద్రుత విలంబిత - దిష్కరవృత్తమ ప్రతిమమయ్యె న - భారగణంబులన్. (భీమన ఛందము) |
75 |
| 4.41. చంద్రకళ | ||
| . |
శ్రావకాభరణాంక! దిశావి - శ్రామముతోడ ర, సా, తముల్ జావిలగ్న, గకారయుతంబై - చంద్రకళాహ్వయమైచనున్. (భీమన ఛందము) |
76 |
| 4.42. అంబురుహము | ||
| . |
శ్రీరమణీప్రియ! మల్లియరేచ! వి - శిష్టకల్పమహీజ భా, భా, ర, స, వంబుల భానువిరామము - వల్కనంబురుహంబగున్. (భీమన ఛందము) |
77 |
| 4.43. క్రౌంచపదము | ||
| . |
పంచశరాభా! యంచిత పుణ్యా! - భ,మ,స,భ,న,న,న,య - పరివృతమైనన్ క్రౌంచపదాఖ్యం బంచితమయ్యెన్ - గ్రమయతి దశవసు - కలితముగాఁగన్. (భీమన ఛందము) |
78 |
| 4.44. సాధ్వి | ||
| . |
నారదసనకస - నందనవినుత స - నాథ భ, న, జ, న, స - నా, భగురుల్ చారుశిఖరియతి - శైల విరమణము - క్ష్మాధర విరతియు - సాధ్వియగున్. |
79 |
| 4.45. మలయజము | ||
| . |
నళినవిలోచన - నజనసనంబులు - నభనగణంబులు - నటలగమున్ మలసి గిరిత్రయ - మహితయతుల్ దగి - మలయజవృత్తము - మహి వెలయున్. |
80 |
| 4.46. ప్రభు | ||
| . |
ప్రముదిత గజఋతు - రసవిశ్రమముల్ - రమణం గవి వ - ర్యనుతంబునునై క్రమమున న, న, నలు - రహినైదుజకా - రములును లగమున్ - బ్రభువృత్తమగున్. |
81 |
| 4.47. మంగళమహాశ్రీ | ||
| . |
శ్రీమహితలోకహిత - శిష్టజన సేవిత వి - శేషగుణ మంగళ మహాశ్రీ నామమగు నబ్భజస - నంబులకడన్ భజస - నంబులు గగంబులు చెలంగన్. (భీమన ఛందము) |
82 |
| 4.48. లయగ్రాహి | ||
| . |
ఇంబలరఁగ భజస - నంబుల తుదన్ భజస - నంబులు భకారము నొ - డంబడ లయగ్రా హింబరఁగ జెప్పఁ గల - శంబిడిన యట్లు యగ - ణంబు కృతిమీఁద నమ - రుం బరహితార్థీ! (భీమన ఛందము) |
83 |
| 4.49. లయవిభాతి | ||
| . |
నసననసనంబులును - నసననసగంబులును బొసఁగి కృతిపాదములు - రసికముగఁ జెప్పన్ గుసుమశరసాయకవ - దసదృశ గుణాభినుత! రసలయవిభాతియని - రసమసుకవీంద్రుల్. (భీమన ఛందము) |
84 |
| 4.50. లయగ్రాహి లయవిభాతులకు యతి నిర్ణయము | ||
| . |
తొమ్మిదింటను దొమ్మిది - తొమ్మిదింట ధృతి లయగ్రాహికిని బ్రాస - యతులు సెల్లుఁ బదిటఁ బదిటను బదిటను - బ్రాసయతులు తగ లయవిభాతికిని జెల్లు - దానవారి! |
85 |
| 4.51. లాక్షణి | ||
| . |
పక్ష విరమణము భననననములును - భాసుర భననస లెనసినచో లాక్షణి యనఁదగు నతులిత మదనవి - లాసలలిత గుణగణజలధీ! |
86 |
| 4.52. రమణకము | ||
| . |
మససిత జనక స - మదరిపు గజహరి - మదగజవసు విర - మణములతో నననన నననన - నలగము లెనయఁగ - నరవరనుత! రమ - ణక మమరున్. |
87 |
| 4.53. దండకము | ||
| . |
అమరంగ సనహంబు లందాదిగానొండెఁ, గాదేని నాదిన్ తకారంబుగానొండె, లోనం దకారమ్ములిమ్మై గకా రావసానంబుగాఁ జెప్పినన్ దండకంబండ్రు దీనిం గవుల్. |
88 |