| భాష | ఛందస్సు | సులక్షణసారము |
| 3. జాత్యుపజాతులు | ||
| 3.1. కందము | ||
| క. |
కందము త్రిశర గణంబుల నందము గాభజసనలము - లట వడి మూఁటన్ బొందును నలజల నాఱిట నొండుం దుదగురువు జగణ - ముండదు బేసిన్. |
24 |
| 3.2. ఉత్సాహ | ||
| . |
సాహచర్య పద్మమిత్ర - సప్తకంబు గురువు ను త్సాహవృత్తమునకె చెల్లు - జలజదళవిలోచనా! |
25 |
| 3.3. ద్విపద | ||
| క. |
ఎలమిన్ మూఁడింద్రగణం బులపై నొక సూర్య గణముఁ - బొందించిన స ల్లలితముగ ద్విపదలక్షణ మిలఁ బదములు రెండు ప్రాస - మేకము కృష్ణా! |
26 |
| ద్విపద. |
ఇంద్రగణములు మూఁ - డినగణం బొకటి చంద్రాస్య! ద్విపదకుఁ జనుఁజెప్ప రేచ! (భీమన ఛందము) |
27 |
| ద్విపద. |
నడురాత్రి యరుదెంచె - నరలోకనాథ కడుడస్సి నాఁడవు - కచుమోడ్తుగాక. (రంగనాథ రామాయణము) |
28 |
| 3.4. తరువోజ | ||
| తరువోజ. |
నలనామగణము లి - నగణంబుతోడ, నాలుగుగాఁజేసి - నయముతోడుతను కలయంగ నెనిమిది - గణములై రెండు గణముల తుదఁగూడఁ - గా యతి నిల్పి వెలయంగఁ బాదముల్ - విరచింప వళ్ళు వేర్వేఱ నిప్పాట - విదితమైయుండ సలలితగతిఁ గృతి - చనఁజెప్పుఁ డనియె జానుగాఁ గవిజనా - శ్రయుఁడు తర్వోజ. (భీమన ఛందము) 29 3.5. మధ్యాక్కర |
|
| మధ్యాక్కర. |
సురరాజ యుగముతోఁ గూడి సూర్యుతో నొడఁబడియుండి సురరాజ యుగముతోఁ గూడి సూర్యుతో నొడఁబడి వెండి కరమొప్పు నీ పాట నాఱు గణముల మధ్యాక్కరంబు విరచింపఁ బ్రావళ్ళు నిట్లు వెలయుఁ గవిజనాశ్రయుండ. (భీమన ఛందము) |
30 |
| 3.6. ఆటవెలఁది - తేటగీతి | ||
| ఆ. |
ఇనగణత్రయంబు - నింద్రద్వయంబును హంసపంచకంబు - నాట వెలఁది సూర్యుఁ డొక్కరుండు - సురరాజులిద్దఱు దినకరద్వయంబు - తేటగీతి |
31 |
| తే. |
జడలు దాలిచి తపసుల - చందమునను దమ్ముఁడును దాను ఘోరదు - ర్గములందుఁ గూరగాయలు కూడుగాఁ - గుడుచునట్టి రాముఁ డేరీతి లంకకు - రాఁగలండు? (మొల్ల రామాయణము) |
32 |
| 3.7. సీస పద్యము | ||
| తే. |
ఇంద్రగణము లాఱు - నినగణంబులు రెండు పాదపాదమున - బరఁగుచుండు ఆట వెలఁదియైనఁ - తేటగీతియునైనఁ జెప్పవలయు మీఁద - సీసములకు |
33 |
| 3.8. ద్విపదాదుల విశ్రమ స్థానములు | ||
| ఆ. |
ద్విపద సీసములకు - విశ్రాంతి రెంటిపై నెలమి గీత కంద - ములకు మూఁటి కడలయతులు నాల్గు - గణములమీఁద ను త్సాహమునకు నిరతి - సారసాక్ష |
34 |