| శతకములు | నారాయణ శతకము |
|
| మ. |
పసులంగాపరి యే మెఱుంగు మధురప్రాయోల్లసద్వృత్తవా గ్విసరారావము మోవి దా వెదురుగ్రోవిం బెట్టినాఁ డంచు ని\న్ గసటుల్ సేయఁగ నాఁడు గోపిక లతద్గానంబులన్ మన్మథ వ్యసనాసక్తులఁ జేయుచందములు నే వర్ణింతు, నారాయణా! |
51 |
| మ. |
జడ యెంతేఁ దడ వయ్యె జెయ్యి యలసె\న్ శైలంబు మాచేతులం దిడు మన్న\న్ జిరునవ్వుతో వదలిన\న్ హీనోక్తి గీపెట్ట నె క్కుడు గోవుల్ బ్రియమంద నింద్రుఁ డడలం గోవర్ధనాద్రీంద్రమున్ గొడుగై యుండగఁ గేలఁ బూనితి గదా గోవింద, నారాయణా! |
52 |
| మ. |
లలితాకుంచితవేణియం దడవిమొల్లల్ జాఱ ఫాలస్థలి\న్ దిలకం బొయ్యన జాఱఁ గుండలరుచుల్ దీపింప లేఁజెక్కులన్ మొలకన్నవ్వుల చూపు లోరగిల మే న్మువ్వంకల\న్ బోవఁగా నలి గైకొందువు గాదె నీవు మురళీనాట్యంబు, నారాయణా! |
53 |
| శా. |
మాపాలం గడు గ్రొవ్వి గోపికలతో మత్తిల్లి వర్తింతువే మాపాలెంబుల వచ్చి యుండుదు వెస న్మాపాలలో నుండు మీ మాపా లైనసుఖాబ్ధిలో మునుగుచున్ మన్నించి తా గొల్లలన్ మాపాలం గలవేల్పు వీవె యని కా మన్నింతు, నారాయణా! |
54 |
| మ. |
ఒకకాంతామణి కొక్క డీవు మఱియు న్నొక్కర్తె కొక్కండ వై సకలస్త్రీలకు సంతతం బలర రాసక్రీడ తన్మధ్య క ల్పకమూలంబు సవేణునాదరస మొప్పంగా బదార్వేల గో పికలం జెంది వినోద మొందునెడ నీ పెంపొప్పు నారాయణా! |
55 |
| మ. |
లలితం బైన భవత్తనూవిలసనన్ లావణ్యదివ్యామృతం బలుఁగు ల్వారఁగ నీకటాక్షమునఁ దా మందంద గోపాంగనల్ తలఁపు ల్పాదులు కట్టి కందళిత నూత్నశ్రీలు వాటింతు రా నెలతల్ తీవెలు చైత్రవిస్ఫురణమౌ నీ యొప్పు నారాయణా! |
56 |
| మ. |
లీలన్ పూతనప్రాణవాయువులు పాలిండ్లందు వెళ్ళించి, దు శ్శీలుండై చను బండిదానవు వెసం జిందై పడం దన్ని యా రోల న్మద్దులు గూల్చి ధేనుదనుజున్ రోఁజంగ నీల్గించి వే కూలన్ కంసునిఁ గొట్టి గోపికలకోర్కుల్ దీర్తు, నారాయణా! |
57 |
| మ. |
రసనాగ్రంబున నీదు నామరుచియు\న్ రమ్యంబుగాఁ జెవ్లుకు న్నసలారంగ భవత్కథాభిరతియున్ హస్తాబ్జయుగ్మంబులన్ వెస నీపాదసుపూజితాదియుగమున్ విజ్ఞానమధ్యాత్మకున్ వెస నింపొందనివాఁడు దాఁ బశువు సూ వేదాత్మ, నారాయణా! |
58 |
| మ. |
వరకాళిందితరంగడోలికలలో వైకుంఠధామంబులో వెర వొప్పార నయోధ్యలో మధురలో వ్రేపల్లెలో ద్వారకా పురిలో నాడెడుభంగి నాదుమదిలో భూరిప్రసన్నాననాం బురుహం బొప్ప నటించు టొప్పును సితాంభోజాక్ష, నారాయణా! |
59 |
| శా. |
చల్ల ల్వేఱొకయూర నమ్ముకొను నాసం బోవుచోఁ ద్రోవ నీ వుల్లాసంబున నడ్డ కట్టి మదనోద్యోగానులాపంబుల\న్ చల్లన్ జల్లనిచూపు జల్లు మని గోపస్త్రీలపైఁ జల్లు మీ చల్లంబోరుతెఱంగు జిత్తమున నే జర్చింతు నారాయణా! |
60 |