| శతకములు | కుప్పుసామి శతకము |
|
|
కూలినాలి చేసికొనుచు జీవించువాఁ డేని నీతిశాలి యెందుఁ బూజ నీయుఁ డతని నెపుడు నెఱనమ్మగా వచ్చుఁ గొఱఁతరాదు దానఁ గుప్పుసామి. |
41 |
|
బ్రతికి చెడ్డవాని వలని నేస్తముఁజేయు చెడి బ్రదికినవాని చెలిమి వలదు వీనియందు నేది విపరీతమైనను ముప్పు తప్పఁబోదు కుప్పుసామి. |
42 |
|
ఒక్క కొడుకెయైన నూరక చెడిపోవు మకురు తనము చేత మాటలేల? పెద్దయైన కొలఁది పెద్దగాఁ జింతించుఁ గొడుకు కొఱకుఁ దండ్రి కుప్పుసామి. |
43 |
|
ప్రతిభ గల్గువాఁడు పతనంబుఁ జెందిన మరల పైకివచ్చు మహిత శక్తి రాలి పడిన పూలు రమణులు క్రొవ్వెద నొప్పుఁ జూపరావె? కుప్పుసామి. |
44 |
|
చేతగామిఁ బనులు చెడిపోయి నంతనే విధిని దూరుచుంద్రు వెఱ్ఱివారు విధికి దీననేమి పెత్తనంబుండునో! తప్పుమాటగాక కుప్పుసామి. |
45 |
|
ముండులున్న నేమి మురువు గొల్పు గులాబి గొప్పవారుకూడఁ గొనుచునుంద్రు కొద్దిదోషమున్న గుణవంతుఁ బూజింత్రు తప్పకుండ జనులు కుప్పుసామి. |
46 |
|
సాన నరగఁదీయు కొలంది చందనంబు కలయఁ జిమ్ముచు నుండును గమ్మతావి సజ్జనుం డిట్టులనె కష్ట సమయమందు నొప్పుఁ గాంచుచు నుండును గుప్పుసామి. |
47 |
|
వారకాంతలఁ బడఁదిట్టు వారుగలరు విటులు క్రవ్వింపకుండిన వేశ్యలెట్లు చెఱచువారలో పురుషులఁ జెప్పఁబోరు కుచ్చితులుగారె వీరెల్లఁ గుప్పుసామి. |
48 |
|
విత్త మన్యాయముగఁ గూడఁబెట్టి భయము చేత దానధర్మంబులఁ జేయుటేల అడుసు ద్రొక్కఁగానేల? కాల్గడుగనేల? యెప్పుడైన లాభముకద్దె? కుప్పుసామి. |
49 |
|
పురుషుఁ డెన్ని రోగములచేతఁ బీడింపఁ బడుచునున్న సతికి వరవుడంబు సల్ప ధర్మమంట జగతిలో నిదియెటో చెప్పఁబోరు జనులు కుప్పుసామి. |
50 |