యుద్ధకాండము-35
రాగం: పున్నాగవరాళి - తాళం: ఆది
పల్లవి:
భజేఽహం భవాని హృదాభావితం బుధసేవితం ॥భజే॥
అనుపల్లవి:
నిజాశ్రిత భవదవానల వినిర్మల నామధేయం
జన్మహీయం హరాజగేయం ప్రజామరేంద్రం రామచంద్రం ॥భజే॥
చరణములు:
ఇందీవరదళశ్యామం హితప్రసన్న ముఖాభిరామం
బృందారకశోకవిరామం శ్రీకాముక మకామం
వందిత సనకసనందన సోమ మరిందమం శ్రీరామం ॥భజే॥
ప్రపన్నానందసందోహం ప్రమోదావహ మమేయదేహం
తపోయోగసమాధివిమృగ్యం తపనజా పూర్వభాగ్యం
సుపర్వభావ్యం కృపణాభావ్యం కృపావినిద్రం రామభద్రం ॥భజే॥
విదేహజానందరూపం విభీషణాదికృతసల్లాపం
చిదానందమూలాయుత మశేషయోగ సమన్వితం
త్వదాప్తివిరతః సదాస్థిరతః ప్రదుష్టమతిమాన్ ప్రసంగవాన్ ॥భజే॥
స్ఫురద్రత్నకేయూరకాంతం కిరీటకుండలభానుమంతం
పురారాతిలోభం శ్రీపురందర మణిమిత్రాభం
స్మరాతికాంతం సహనుమంతం స్థిరం శాంతం శ్రీకాంతం ॥భజే॥
జ్వలచ్చంద్రకాంతాసనీనం క్షమాసుతయా సుఖాసీనం
దళత్పంకజదళాయతాక్షం దయాకటాక్షవీక్షం
ఖలారినాశం కైవల్యకోశం విలాస శేషాచలాధీశం ॥భజే॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi