యుద్ధకాండము-17
రాగం: పూరి - తాళం: త్రిపుట
పల్లవి:
శ్రీజగన్నాథ హే రఘువర దయానిధే ॥శ్రీజగన్నాథ॥
అనుపల్లవి:
ఓజసా తేజసా భాజసే త్వన్నమో హరే ॥శ్రీజగన్నాథ॥
చరణములు:
కారణాకారణా పాపనివారణా నారాయణ
ధారణాశ్రయ పరమాత్మన్ హరే ॥శ్రీజగన్నాథ॥
నిఖిలలోకాధారసాక్షిన్ విశ్వస్యబోధాకర
సుఖరూప మాయామనుజశరీర ॥శ్రీజగన్నాథ॥
పూర్ణోఽపి సర్వేషాం న విభాసి స్ఫురసి త్వమమలాత్మనాం
కర్ణధారో భవాంబుధేః ॥శ్రీజగన్నాథ॥
ఉన్మీలయన్నేత్రే సృజసి జగదుపసంహరసి
చిన్మాత్రే త్వయి సన్మనోనిమీలనేన ॥శ్రీజగన్నాథ॥
యస్మిన్ భాతీదం చరాచరం యస్మాద్భవతీదం
తస్మై బ్రహ్మణే తే నమః ॥శ్రీజగన్నాథ॥
ప్రకృతిపురుష కాలవ్యక్తావ్యక్త బహురూపిణం జానంతి యం
సుకృతినోఽముష్మై రామాత్మనే నమః ॥శ్రీజగన్నాథ॥
త్వాం సర్వజగదాధారమూర్తి మితి వదతి శ్రుతి రవికారం సా
శంసతి జ్ఞానరూపమాత్రం ॥శ్రీజగన్నాథ॥
నాధిగచ్ఛంతి బుధాః శ్రుతివాదినః త్వత్ప్రసాదం వి-
నా విరోధాద్వైతికాద్దేవ నిశ్చయం ॥శ్రీజగన్నాథ॥
విలసతో మాయయాన క్వచిదపి భేదో రవేరివ తే
జలదర్పణాదిభిర్దృశ్యతే రామ ॥శ్రీజగన్నాథ॥
త్వయి భ్రాంత్యాకల్ప్యతే మనసా విషయం తవ రూపం దృశ్యకథం క-
థయ దృశ్యాభావే ధ్యానం కథం ॥శ్రీజగన్నాథ॥
హే హరే తేఽవతారేషు రూపాణి సుహృదో ధ్యాయంతి యే
తే హితరతిసంసారార్ణవం ॥శ్రీజగన్నాథ॥
కామాదయః శత్రవో భీషయంతి మామరమ్మార్జాలాః
యథా మూషకాన్ తథా ధర్మసేతోః ॥శ్రీజగన్నాథ॥
మానసవాక్కాయికైః సద్గురురూపధ్యానస్మరణార్చనేషు ధు-
రీణానాం సంసృతిః గోష్పదాయతే ॥శ్రీజగన్నాథ॥
మామవ సేవేత్వాం శేషాచలస్వామిన్ మణిరఘూణాం సు-
నామన్ శ్రేయోధామన్ ॥శ్రీజగన్నాథ॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi