యుద్ధకాండము-06
రాగం: సురటి - తాళం: అట
పల్లవి:
రామలింగా వృషభతురంగా రాజితాంగా ॥రామ॥
అనుపల్లవి:
కామితప్రద సత్కరుణాపాంగా కామగర్వభంగా గంగోత్తమాంగా ॥రామ॥
చరణములు:
అమరాచలచాప అజ్ఞానాంధదీప
శమనాంతకరూప సుగుణకలాప అమితప్రతాప
శమితనమజ్జనజన్మసంచితపాప
విమతాంతకరూప విశ్వనిర్లేప ॥రామ॥
బాలేందుకిరీట భవ్యజటాజూట
శ్రీలసల్లలాట శ్రుతిచయఘోట త్రిపురదావకృపీట
లీలాహాస నిర్మూలితనిశాట
శూలాయుధఖేట సుజనహేమకూట ॥రామ॥
సోమార్కానలనేత్ర సుందరీజనచైత్ర
హైమవతీకళత్ర సన్నుతిపాత్ర కామలతాలవిత్ర
సామజాసురజైత్ర సకలలోకసూత్ర
శ్రీమచ్చరిత్ర శేషాద్రీశమిత్ర ॥రామ॥
తాంకిట తకతకిట రిమరిసరీ
తహతఝేం రిమపధత కుందఝేం తారి తధపధమప
తాహ తకిటతక ఝేం తారిస్సరిమరీ సనిసరీసనిధప
తాం తకిట పధమనిధపమ ధళాంగు ధిమితక దధిగిణతోం ॥రామ॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi