కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
బాలకాండము-01
రాగం: ధన్యాసి - తాళం: ఆది
పల్లవి:
నమశ్శివాయ తే నమో భవాయ ॥నమ॥
అనుపల్లవి:
సమానాధికరహితాయ శాంతాయ స్వప్రకాశాయ
ప్రమోదపూర్ణాయ భక్తౌఘపాలనాయ ॥నమ॥
చరణములు:
గర్వితదానవలోకఖండనాయ శ్రీరజత-
పర్వతాగ్రనిలయాయ పావనాయ
సర్వలోకపాపపుంజ నిర్వాపణాయ శర్వాయ
దర్వీకరభూషణాయ సర్వోత్తమాయ ॥నమ॥
అండజాధిపవాహన కాండాయ మేరుశైలకో-
దండాయ శితికంఠాయ పండితాయ
మండిత త్రిపురజయోద్దండతాండవాయ బ్ర-
హ్మాండనిలయాయ మహామాయాతీతాయ ॥నమ॥
మందహాసవదనారవిందసుందరాయ యోగి
బృందానందదాయ శత్రుభీకరాయ
ఇందుసూర్యాగ్నినేత్రాయ వందిత ప్రమథగణాయ
నందివాహనాయ పోషిత బృందారకాయ ॥నమ॥
నిరుపమానందఘననిశ్చితాయ శాశ్వతాయ
వరదాభయంకరణాయ గిరీశాయ
తరుణేందుశేఖరాయ పరమపురుషాయ భవ-
హరణాయ శ్రీకాళహస్తీశ్వరాయ ॥నమ॥
గంగాభంగతరంగసంగత జటాజూటాయ
సంగీతలోలాయ శుభసంగతాయ
అంగజాంతరంగ మదభంగాయ స్ఫటికోప-
మాంగాయ శేషశైలాధీశమిత్రాయ ॥నమ॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi