| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | తృతీయాశ్వాసము |
| శ్రీకృష్ణుఁడు వైజయంతమున విడియుట | ||
| చ. |
అని కొనియాడి విశ్వ భువనైక ధురంధర! నేఁడు రేపు నీ వనితయు నీవు నిచ్చట నవశ్యము మజ్జన భోజనాది పూ జనములు గైకొన న్వలయు సమ్మతిమై నని పల్క, దేవతా జననికి మ్రొక్కి యియ్యకొని జంభవిరోధి మొగంబుఁ జూచిన\న్. |
39 |
| చ. |
అమరవిభుండు సేరి వినయానతుఁ డై విడిపట్టు వైజయం తమునను జిత్తగింపు మన నవ్వుచుఁ ద ద్బలదైత్యవైరి హ స్తముఁ గయిదండ కొంచు గిరిశ ప్రముఖాఖిల లోకపాలకుల్ క్రమమునఁ జేరి కొల్వఁజని కాంచెఁదదుజ్జ్వల సౌధరాజము\న్. |
40 |