| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | ప్రథమాశ్వాసము |
| సత్య తనకు మ్రొక్కెడు పతి శిరమును బాదమునఁ దొలఁగఁ ద్రోయుట | ||
| మ. |
జలజాతాసన వాసవాది సుర పూజా భాజనంబై తన ర్చు లతాంతాయుధు కన్న తండ్రి సిరమచ్చో వామ పాదంబునం తొలగం ద్రోచె లతాంగి ! యట్ల యగు నాథుల్ నేరముల్ సేయ పే రలుకన్ జెందిన యట్టి కాంతలుచిత వ్యాపారముల్ నేర్తురే? |
121 |
| క. |
కోపన పద హతి కుహనా గోపాలుడు కాంచి మెయి గగుర్పొడవఁగ ను ద్దీపిత మన్మధ రాజ్య ప్రాపితుఁడై పలికె కూర్మి బయట పడంగన్ |
122 |