| భాష | ఛందస్సు | సులక్షణసారము |
| 7. కావ్యాదిగ్రాహ్యవర్ణ విచారము | ||
| 7.1. పంచభూత బీజాక్షరములు | ||
| 7.1.1. వాయు బీజాక్షరములు | ||
| క. |
పరఁగఁగ అ ఆ ఏ లును వరుసఁ గ చ ట త ప య ష లు ధ్రు - వంబునఁ బదియున్ ధరఁ భవన బీజములు గో వరవాహన! సకలలోక - వందిత చరణా! (వాదాంగ చూడామణి) |
174 |
| 7.1.2. అగ్ని బీజాక్షరములు | ||
| క. |
క్రమమున ఇ ఈ ఐలును రమణ ఖఛఠథఫరసలును - రాజిలుఁ బదియున్ సమముగను దహన బీజము లమరఁగఁ దలపోయ శంబ - రాంతక హరణా! (వాదాంగ చూడామణి) |
175 |
| 7.1.3. భూ బీజాక్షరములు | ||
| క. |
మున్నుగ ఉ ఊ ఓలును నెన్నఁగ గజడదబలహలు - నీ ధరఁ బదియుం బన్నుగ భూ బీజంబులు పన్నగ వరశయన బాణ! - పన్నగభరణా! (వాదాంగ చూడామణి) |
176 |
| 7.1.4. ఉదక బీజాక్షరములు | ||
| క. |
ధీరత ఋ ౠ ఔలును సారపు ఘఝఢధభవళలు - సరసన్ బదియున్ దోరపు జలబీజంబులు ఘోరాసుర పురవిదార! - గోధ్వజ కలితా! (వాదాంగ చూడామణి) |
177 |
| 7.1.5. ఆకాశ బీజాక్షరములు | ||
| క. |
ఌ ౡ అం ఙ ఞ న మలు సల్లలితములై వెలుంగు - శక్షలు పదియుం జెల్లు గగన బీజములని తెల్లముగా వాసవాది - దివిజస్తుత్యా! (వాదాంగ చూడామణి) |
178 |
| 7.2. పంచభూత బీజాక్షర ఫలంబులు | ||
| మ. |
క్షితిబీజంబులు సంపదల ల్వొదలఁ బో - షించున్ బయోబీజము ల్సతతంబున్ ప్రమదం బొనర్చు శిఖి బీ - జంబుల్ మృతింజేయు మా రుత బీజంబులు శోకవార్ధిఁ బడఁగా - ద్రోయు న్నభోబీజముల్ పతి నత్యంత దరిద్రుఁ జేయు మిగులం - బద్యాది నొందించినన్. (భీమన ఛందము) |
179 |
| 7.3. అమృతాక్షర విషమాక్షరములు | ||
| క. |
అమృతాక్షరములు హ్రస్వము లమరఁగ దీర్ఘములు విషము - లనఁబడు వీనిన్ గ్రమమున అకచటతపయశ సముదయమును దెలిపి నిలుపఁ - జనుఁ బద్యాదిన్. (గోకర్ణ చ్ఛందము) |
180 |
| క. |
తెలియక ఘోషాక్షరములు నెలవుగఁ బద్యాదియందు - నిలిపిన చోటన్ నలమటఁ బొందియుఁ గృతిపతి పలుమఱు వెతనొంది దైన్య - పాటుం జెందున్. |
181 |
| క. |
అకచటతప యశ లెనిమిది ప్రకటిత గిరి ఋతులమూఁటఁ - బదునొక్కింటన్ వికటముగఁ బెట్టి పద్యము సుకవులు సత్ప్రభువుల కిడ ర - శుభకరమగుటన్. (ఉత్తమగండచ్ఛందము) |
182 |
| క. |
పుర శర రస గిరి రుద్రుల నరయ నకచటతప లిడుట - యనుచిత మీ య క్షరములు నరచఛజంబులు బరిహరణీయంబు లాదిఁ - బంకజనాభా! (అనంతుని ఛందము) |
183 |
| చ. |
రస గిరి రుద్రసంఖ్యలను - రాదొనఁగూర్ప స్వరాదివర్ణముల్ వసుధ హకారమున్ క్షరట - వర్ణ చవర్ణభముల్ దలంపఁగా అసజగరంబు లగ్ను లెడ - నైదవచోట హలాది వర్ణముల్ ససిదగఁ జెప్ప నాఱిట ర - సల్ జగముల్ గదియింప వర్జ్యముల్. |
184 |
| క. |
ఌలుఋలుఙఛఝఙటదధణ దలునవబణములును రళలు - దగ నక్షలున్ నెలకొని పద్యముఖంబున నిలుపరు సత్కవులు శాస్త్ర - నింద్యము లగుటన్. (అధర్వణుని ఛందము) |
185 |
| క. |
హజగడ లివి మూఁటవచో నిజముగ నిందించి చెప్ప - నీల్గుటయరుదే భుజగమునకన్నఁ గీడగు సుజనామరభూజ! రేచ! - సుగుణసమాజా! (భీమన ఛందము) |
186 |
| క. |
ఘోరతరపద్యముఖమున వేఱుగ నొకచోట చూచి - వెదకఁగనేలా యాఱవకడ 'తా' నిలిపిన మాఱమ్మునఁ గ్రుమ్మినట్లు - మడియు మనుజుఁడున్. (భీమన ఛందము) |
187 |
| చ. |
హయమదిసీత పోతవసు - ధాధిపుఁ డారయ రావణుండు వి నిశ్చయముగ నేను రాఘవుఁడ - జాహ్నవి వారిధి మారుఁ డంజనా ప్రియతనయుండు సింగన వి - భీషణుఁడా గుడిమెట్ట లంక నా జయమును బోతరక్కసుని - చావును నేడవనాఁడు సూడుఁడీ. (భీమన చాటువు) |
188 |
| 7.4. శ్రీకార ప్రభావము | ||
| క. |
శ్రీకారము కృత్యాదిని బ్రాకటముగనున్నఁ జాలు - బహుదోషములం బోకార్చి శుభము లొసఁగును బ్రాకృతముగ నినుముసోఁకు - పరుసము భంగిన్. |
189 |
| 7.5. అక్షరములకు గ్రహాధిపతులు | ||
| తే. |
ఆదులకు రవి కాదుల - కవనిజుండు చాదులకు బుధుఁడును, గవి - డాదులకును తాదులకు బృహస్పతి, శని - పాదులకును యాదులకు నెల్ల శశియు గ్ర - హంబు కృష్ణ! |
190 |
| 7.6. వర్గములకు జాతులు | ||
| క. |
వసుధామరులకు కచటలు వసుధాపతులకును తపర - వలు వైశ్యులకున్ యసహలశషలకును శూద్రుల కసమపు ళక్షటలు చెప్ప - నగుఁ బద్యాదిన్. (అధర్వణుని ఛందము) |
191 |
| క. |
కాదులు వర్గత్రయమును భూదేవతలు, తపవర్గ - ములు రవలును ధా త్రీ దయితులు యలశషసహ లాదట వైశ్యులును ళక్ష - ఱంబులు శూద్రుల్. (అనంతుని ఛందము) |
192 |
| 7.7. మాతృకా పూజనము | ||
| సీ. |
కాది త్రివర్గ వ - ర్ణాలికి మౌక్తిక, వజ్రభూషలుఁ దెల్పు - వస్త్రములును తపవర్గ రవవర్ణ - తతి కబ్జరాగంపుఁ, దొడవులు వలువలు - దొవరు చాయ యలశషసహ బీజ - ములకగుఁ బుష్యరా - గాభరణములు పీ - తాంబరములు ళక్షఱంబులకు నీ - లాల సొమ్ములు గారు, కొను నీలి వన్నెల - కోక లెల్ల |
|
| తే. |
వరుస నీనాల్గు తెఱఁగుల - వర్ణములకు ననుభవంబగు ద్రవ్యంబు - లానవాలు నాజ్యమును గమ్మఁ దేనియ - యాసవంబు వీనిఁ దెలియక సత్కవి - యౌనె జగతి. (కవిసర్పగారుడము) |
193 |
| 7.8. సంయుక్తాక్షర ప్రయోగవిధి | ||
| తే. |
మొదల సంయుక్త వర్ణంబు - గదిసె నేని మడప కా రెంటికిని గ్రహ - మైత్రివలయు నిది విచారింపఁడేనిఁ గృ - తీశ్వరుండు పిడుగు మొత్తిన గతిఁగూలు - బిట్ట బిఱ్ఱు. (భీమన ఛందము) |
194 |
| 7.9. కావ్యాది వర్ణశుద్ధి | ||
| తే. |
ఆదిపద్యాది శ్రీకార - మైన దేవ వాచకంబైన నప్పుడు - వఱలు సిరులు నాది పద్యాది మూఁడు గ - ణాక్షరములు చూడవలెఁ గాని యన్నియుఁ - జూడవలదు. |
195 |