| భాష | ఛందస్సు | ఛందోదర్పణము ద్వితీయాశ్వాసము |
ఛందోదర్పణము - అనంతామాత్యుఁడు - ద్వితీయాశ్వాసము
| క. |
శ్రీరమణ భక్త లోకమ నోరమణ జగత్త్రయాభినుత రంజిత గౌ రీరమణ సంభరిత వా ణీరమణ యనంతశయన నీరజనయనా. |
1 |
| క. |
కనుఁగొనఁ బాదరహితమై పనుపడి హరిగద్దెవోలె బహుముఖరచనం బున మెఱయు గద్య మది దాఁ దెనుఁగుకృతుల వచన మనఁగ దీపించుఁ గడు\న్. |
2 |
| గద్యము. |
స్వస్తి సమస్త భువన రక్షాదక్ష శ్రీపుండరీకాక్ష భుజగ పతి సింహాస నారూఢ సురనికర మకుట తట ఘటిత సురుచిర మణిగణ ప్రభా విభాసిత పాద పీఠ! వేద నినదానుకారి గౌరవ లలిత నూపురాలంకృత చరణ సరసిజ యుగళ నవ్య పదాంగుష్ఠ నఖ మయూఖ రేఖాయిత సుర సరిత్ప్రవాహ పీతాంబరధర నూత్న మేఖలా కలిత కటిత ప్రదేశ చతురాననజనక నాళీకశోభితనాభి సరోవర, యఖండ బ్రహ్మాండ కలాప గోపన నిపుణోదర, క్షీర సాగర తనయా మనోజ్ఞ గేహీకృత విపుల వక్షస్థల కనత్కనక కటక కేయూర ప్రముఖ భూషణ భూషిత చతుర్భుజ, శంఖపంకజసుదర్శన గదాధర కిరీట కుండలాభిరామ యనవరత ప్రసన్న వదన కౌండిన్యవరద శ్రీయనంత పద్మనాభ నమస్తే నమస్తే నమః అని గద్యపఠనం బొనర్చు నుత్తములకు నుత్తమాయు రారోగ్యంబు లొదవునని విశదవచనంబుల విద్వజ్జనంబు లభినుతింతురు. |
3 |
| ఛందములు | ||
| క. |
సమవృత్తము లనియెడు ను త్తమ రత్నంబులకు జన్మధామములై పెం పమరు సముద్రమ్ముల చం దము లై ఛందములు మహి సుదర్శనపాణీ! |
4 |
| సీ. |
ఉక్తయు నత్యుక్తయును మధ్యయును బ్రతి-ష్ఠయు సుప్రతిష్ఠయు సరళమైన గాయత్రి యుష్ణిక్కు నాయనుష్టుప్పును - బృహతియుఁ బంక్తియు మహితమైన త్రిష్టుప్పు నలజగతియు నతిజగతియు - శక్వరి మఱి యతిశక్వరియును నష్టియు వెండి యత్యష్టియు ధృతియును - నతిధృతియును మఱి కృతియుఁ బ్రకృతి |
|
| ఆ. |
యాకృతియును వికృతి యటుసంకృతియు నభి కృతియు నుత్కృతియనఁ గీర్త్యమగుచు జరుగు నిరువదారు ఛందంబు లేకోత్త రాధికాక్షరముగ నబ్జనాభ! |
5 |
| ఛందోవృత్త సంఖ్య | ||
| సీ. |
కరములు వేదముల్ కరులు రాజులు రాగ - సంఖ్య విద్యలు నిభ చక్షురిందు లంగాస్త్రబాహువు లక్షీందుశరములు - గతిలోచనాంబర కమలరిపులు నాగవేదాంబరనయనముల్ ఋతునిధి - ఖాబ్దులు కరవిరించాబ్జఫణులు గతినాగగుణశాస్త్ర కైరవాప్తులు దిగ్గ - జాంగపర్వతలోచనానలములు |
|
| ఆ. |
శాస్త్రవహ్ని బాణశరతర్కములు బాహు శైలఖేందురామచంద్ర సంఖ్య గతిగతీందు బాహుఋతుబాహు లహినాగ బాహువేద బాహుబాణచయము. |
6 |
| సీ. |
ఋతుశైల శరగజగతి ఖేందు లక్షిభూ - తేంద్వద్రినిధిగగ నేక్షణములు నిగమాభ్రగుణగతి నిధిచంద్రగతులు వా - రణఖర్తుగజదంతిరామకరులు తర్కేందుకరమునిత్రయతర్క విధు లక్షి - పావకాబ్ధిసముద్ర బాణబాణ వహ్నివహ్నులు బ్రహ్మవదనాంగభుజగేభ - ఖేందుశైలర్తులు ఛందములను |
|
| ఆ. |
వేఱువేఱ పుట్టు వృత్తసమూహంబు వెండి సర్వవృత్తవితతి యరయ ఋతుకరాద్రి శైలసితదీప్తి నయనతో యధికృశానుచంద్రు లబ్జనయన. |
7 |
| సర్వసమవృత్తభేద సంఖ్య | ||
| చ. |
ఒగిఁబదమూఁడు కోటులును నొప్పుగనల్వది రెండులక్షలు\న్ దగఁ బదునేడు వేలు నుచితంబుగ నవ్వల నేడునూటిపై నగణితవైభవా యిరువదాఱు గదా సమవృత్తభేదముల్ ప్రగుణితలక్షణస్ఫురణఁ బంచినఛందము లిర్వదాఱిటన్. |
8 |
| సమవృత్త లక్షణము | ||
| క. |
హెచ్చును గుందును బొరయక యచ్చొత్తినయట్లు నాలుగడుగులు సమమై వచ్చును యతినియమంబును జెచ్చెర సమవృత్తములకుఁ జిత్తజజనకా! |
9 |
| వ. | సమవృత్తంబు లెట్టి వనిన. | 10 |
| ఉక్తాఛందము: | ||
| శ్రీ. |
శ్రీ భా విం తున్. |
11 |
| అత్యుక్తాఛందము: | ||
| స్త్రీ. |
స్త్రీరూ పారున్ ఘోరా ఘారీ. |
12 |
| మధ్యాఛందము: | ||
| వినయం. |
వినయం బొనరిం తు ననం తునకున్. |
13 |
| ప్రతిష్ఠా ఛందము: | ||
| బింబము. |
శ్రీకలితా స్తోకభగల్ పైకొనుబిం బాకృతికిన్. |
14 |
| సుకాంతి. |
అగు\న్ సుకాం తి గూర్పఁగా జగంబుల\న్ జగత్పతీ. |
15 |
| సుప్రతిష్ఠా ఛందము: | ||
| అంబుజ. |
పంబిభలగా డంబరముగా నంబుజము చె ల్వం బగుహరీ. |
16 |
| పంక్తి. |
ఒక్కభకారం బెక్కు గగంబుల్ నెక్కొనుఁ బంక్తిం దక్కక శౌరీ. |
17 |
| గాయత్రీఛందము: | ||
| తనుమధ్య. |
గోపాలుని దేవే నాపాలికి నాఁగాఁ బై పై తనుమధ్య\న్ బ్రాపించుఁ దయంబుల్. |
18 |
| ఉష్ణిక్ఛందము: | ||
| మధుమతి. |
మధురిపుఁ డనిన\న్ మధురపుననగల్ మధురము లగుచు\న్ మధుమతి నమరున్. |
19 |
| మదరేఖ. |
రూపింప న్మగణాద్యం బై పెంపార సగంబుల్ దీపించు న్మదరేఖన్ గోపస్త్రీ హృదయేశా! |
20 |
| అనుష్టుప్ఛందము: | ||
| విద్యున్మాల. |
మాద్యద్భక్తిన్మాగాయుక్తి\న్ విద్యున్మాలా వృత్తం బొప్ప\న్ చైద్యధ్వంసి\న్ సంబోధింప\న్ సద్యశ్శ్రేయోజాతంబయ్యెన్. |
21 |
| చిత్రపదము. |
వారక భాగురుయుగ్మం బారఁగఁ జిత్రపదాఖ్యం జేరిన వేడ్కఁ గవీంద్రుల్ గోరి నుతింతురు శౌరిన్. |
22 |
| ప్రమాణి. |
సరోజనాభుఁ డచ్యుతుం డరాతి భంజనుం డన\న్ జరేఫల\న్ గలంబుల\న్ ధరం బ్రమాణి యొప్పగున్. |
23 |
| బృహతీఛందము: | ||
| హలముఖి. |
చిత్తజాతునిగురునికై యెత్తుఁ డంజలు లనినచో సత్తుగా రనసములొగి\న్ బొత్తుగా హలముఖి యగున్. |
24 |
| క. |
వదలక పంక్తిచ్ఛందము మొదలుగ నిటమీఁది ఛందముల కందముగా నుదయించు వృత్త సమితికి విదితంబుగ వళులు వలయు విధురవినయనా! |
25 |
| పంక్తిఛందము: | ||
| రుగ్మవతి. |
రూపితరీతి\న్ రుగ్మవతీసం రూపభమంబుల్ రూఢి సగంబుల్ ప్రాపుగ భూత వ్రాతయుతుల్గా శ్రీపతిలీల\న్ జెప్పఁగ నొప్పున్. |
26 |
| మత్త. |
మొత్తం బారు న్మభములు నిత్యో దాతంబై సస్ఫురితగకారా యత్తం బై షణ్మితయతి నొందు\న్ మత్తావృత్తంబగు మహిఁ గృష్ణా! |
27 |
| ప్రణవము. |
ఆరంగా మనయగసంయుక్తి\న్ సారోదంచితశర విశ్రాంతి\న్ శ్రీరాజుం బొరసిన నత్యంత స్ఫారంబై చను ప్రణవం బుర్విన్. |
28 |
| మయూరసారి. |
చూతమా యశోదసూను నంచు\న్ వ్రేత పల్కుఁదర్క విశ్రమంబుల్ భాతిగా రజంబుపై రగంబుల్ జాతిగా మయూరసారిఁ జెప్పున్. |
29 |
| శుద్ధవిరాటి. |
శ్రీమంతుండగు చిన్న కృష్ణుని\న్ ధీమంతు ల్ప్రణుతింప బాణవి శ్రామంబు\న్ మసజంబు గంబునై రామా శుద్ధవిరాటి యొప్పగున్. |
30 |
| మణిరంగము. |
శ్రీమనస్సరసీరుహమిత్రు\న్ బ్రేమ మొప్పఁగ బేర్కొనుచోట\న్ రామనస్త్రవిరామరసాగల్ కోమలంబు లగు న్మణిరంగన్. |
31 |
| త్రిష్టుప్ఛందము: | ||
| తోదకము. |
తోరపువేడుకఁ దోదక వృత్తా కారముగాఁ ద్రిభకారగగంబుల్ నీరజనాభుని నెమ్మినుతింప\న్ జారువిరామము షణ్మితి నొందున్. |
32 |
| ఇంద్రవజ్ర. |
సామర్థ్యలీల\న్ తతజద్విగంబుల్ భూమిధ్ర విశ్రాంతులఁ బొంది యొప్పు\న్ ప్రేమంబుతో నైందవబింబవక్త్రు\న్ హేమాంబరుం బాడుదు రింద్రవజ్రన్. |
33 |
| ఉపేంద్రవజ్ర. |
పురారిముఖ్యామరు పూజనీయు\న్ సరోజనాభు\న్ జతజద్విగోక్తి\న్ దిరంబుగా నద్రియతి న్నుతింప\న్ ఇరాసుతాధీశు నుపేంద్రవజ్రన్. |
34 |
| ఉపజాతి. |
పినాకికోదండము బిట్టుద్రుంచె\న్ దానొప్పగెల్చె\న్ జమదగ్ని సూను\న్ అనంతసత్త్వుం డితఁ డంచు మెచ్చ\న్ జానైన వృత్తం బుపజాతి యయ్యెన్. |
35 |
| క. |
సమపదము లింద్రవజ్రవి షమపదము లుపేంద్రవజ్రఁ జను నుపజాతి\న్ సమవిషమాంఘ్రులు తద్వ్య త్క్రమమైనను నదియ పేరు కమలదళాక్షా! |
36 |
| రథోద్ధతము. |
నందగోపవరనందను\న్ రమా నందుఁ బ్రస్తుతి యొనర్చి షడ్యతి\న్ అందమై రనరవాహ్వయంబు లిం పొందఁ జెప్పిన రథోద్ధతం బగున్. |
37 |
| గీతాలంబనము. |
నాళీకభవామరనాథు లొగి\న్ శ్రీలోలుని గీర్తన సేయ నొగి\న్ బోలంగఁ దజావలఁ బొందిన గీ తాలంబన మై చను నద్రియతిన్. |
38 |
| స్వాగతము. |
నారదాదిమునినాయక వంద్యు\న్ శౌరిఁ జేరుఁ డన స్వాగత మొప్పు\న్ సారమైనయతి షణ్మితి నొందన్ భూరిరేఫనభముల్ గగయుక్తిన్. |
39 |
| శాలిని. |
చేతో రాగం బుల్లసిల్లన్మతాగా ద్యోతంబై షడ్వర్ణయుక్తి\న్ విరామం బేతేరంగా నిందిరేశప్రభావా న్వీతంబైన\న్ శాలినీ వృత్తమయ్యెన్. |
40 |
| శ్యేని. |
ఆరమాధినాథుఁ డక్షయంబుగాఁ జీర లిచ్చె యాజ్ఞసేని కంచుఁ బెం పారఁ జెప్ప శ్యేని యయ్యె షడ్యతి\న్ స్ఫారమై రజంబుపై వరంబుగాన్. |
41 |
| వాతోర్మి. |
దేవాధీశు\న్ హరిఁ దేజో వనధి\న్ భావింపంగా ఋతుభాస్వద్విరతి\న్ ఈవాతోర్మి\న్ మభలేపారుఁ దకా రావాసంబై లగ మర్ది\న్ గదియన్. |
42 |
| చంద్రిక. |
నగణయుగమున\న్ రవంబుల\న్ బ్రగుణరసవిరామసంగతి\న్ తగిలి హరికథాసమేతమై నెగఁడు గృతుల నిండి చంద్రికన్. |
43 |
| జగతీఛందము: | ||
| భుజంగ ప్రయాతము. |
భుజంగేశపర్యంక పూర్ణానురాగు\న్ భుజంగప్రభూతాఖ్యఁ బూరించుచోట\న్ నిజంబై ప్రభూతావనీభృద్విరామం బజస్రంబుగాఁ గూర్ప యాద్వంద్వ మొప్పన్. |
44 |
| తోటకము. |
జలజోదరనిర్మలసంస్తవముల్ విలసిల్లెడుఁ దోటకవృత్తమున\న్ బొలుపై సచతుష్కముఁ బొండగ నిం పలరారఁగఁ బల్కుదు రష్టయతిన్. |
45 |
| తోవకము. |
చెలఁగి నజాయలఁ జెందిన నారీ తిలకము లద్రియతిన్ మృదురీతిన్ వెలయఁగఁ దోవక వృత్తి విభాతి\న్ బలుకుదు రిమ్ములఁ బంకజనాభున్. |
46 |
| స్రగ్విణి. |
దేవకీనందను\న్ దేవచూడామణి\న్ భూవధూవల్లభుం బుండరీకోదరు\న్ భావనాతీతునిం బల్కఁగా స్రగ్విణీ భావ మాద్యంతరేఫంబగు\న్ షడ్యతిన్. |
47 |
| ఇంద్రవంశము. |
సొంపార నీ దేవుని సూనుఁడై కదా ఱంపిల్లెఁ బుష్పాస్త్రుఁడు ఱాఁగ యౌనన\న్ ఇంపార భూభృద్యతి నింద్రవంశము\న్ బెంపారఁ దాజంబులఁ బేర్చు రేఫతోన్. |
48 |
| వంశస్థము. |
నమో నమో దేవ జనార్దనాయ తే నమో నమః పంకజనాభ నావుడు\న్ రమించు వంశస్థ విరామమద్రుల\న్ సమంచితంబై జతజంబు రేఫయున్. |
49 |
| ద్రుతవిలంబితము. |
శ్రుతి మతాంగ నిరూఢమహాయతి\న్ యతివర ప్రముఖార్యజనం బొగి\న్ ద్రుతవిలంబిత తోషితరీతుల\న్ క్షితిధరు\న్ నుతిసేయు నభారలన్. |
50 |
| జలధరమాల. |
శ్రీతన్వీశుం దగిలితిఁ జిత్తం బార\న్ మాతా యంచు\న్ జలధరమాలావృత్తం బేతేరంగా మభనమ లింపొందంగాఁ బ్రీతిం బల్క న్విరతి కరి\న్ బ్రాపించున్. |
51 |
| ప్రియంవద. |
త్రిభువనాభినుతు దేవదేవుని\న్ బ్రభుముకుందు నిటు ప్రస్తుతింపఁగా నభజర ల్గదిసినం బ్రియంవదా విభవ మొప్పు గిరి విశ్రమంబులన్. |
52 |
| ప్రమితాక్షరము. |
కమనీయతేజుని నగణ్యయశు\న్ గమలాధిపుం బలుకఁగా సజసల్ క్రమమొప్పుఁ గూడఁగ సకారముతోఁ బ్రమితాక్షరం బహివిరామమగున్. |
53 |
| జలోద్ధతగతి. |
సరోరుహదళాక్ష శాశ్వతయశా పురారినుత యంచు భూదరయతి\న్ సరాగ మగుచున్ జసల్ జసలతో నురుప్రభ యగున్ జలోద్ధతగతిన్. |
54 |
| విశ్వదేవి. |
జానొందం గావ్యశ్రీకి సంప్రీతితోడ\న్ మానాథు న్నాథుం జేసి మాయాగణంబుల్ ధీనిత్యుల్ ధాత్రీభృద్యతిం గూర్తు రింపుల్ తేనెల్ సోనల్ గా విశ్వదేవీసమాఖ్యన్. |
55 |
| అతిజగతీఛందము: | ||
| మత్తమయూరము. |
భోజాధీశుం డంచుఁ బ్రభూతాత్మకుఁ డంచు\న్ భ్రాజిష్ణుం డంచు\న్ యతి బాగౌ గిరి సంజ్ఞ\న్ ఓజస్స్ఫీతంబై మతయో పేతసగంబుల్ ఓజం బల్క న్మత్తమయూరం బలరారున్. |
56 |
| జలదము. |
మ్రొక్కుల కెల్ల నెల్ల యగుమూర్తి గదా యక్కమలాక్షుఁ డంచుఁ జతురాస్యయతి\న్ దక్కక ప్రస్తుతింప జలదం బగు ని ట్లొక్కటియై భరేఫనభ లొందు గురున్. |
57 |
| మంజుభాషిణి. |
దివిజేంద్రుఁ డాదియగు దేవసంఘముల్ భువి మంజుభాషిణికి భోగిరాడ్యతి\న్ సవరింపఁగా సజసజంబు గాంతమై భువనోదరస్తుతి యపూర్వ మై చనున్. |
58 |
| ప్రహర్షిణి. |
ముక్తిశ్రీకరు భవమోచను న్మురారి\న్ భక్తిం బ్రోడజనులు ప్రస్తుతింప నొప్పు\న్ వ్యక్త గ్రావయతిఁ బ్రహర్షిణి సమాఖ్య\న్ యుక్తంబై మనజరగోజ్జ్వలద్గణాప్తి\న్. |
59 |
| ప్రభాతము. |
సరసిజనాభ భుజంగ రాజతల్పా శరణము నీవని సన్మతిం దలంప\న్ బెరయు నజారలు పేర్మి నొప్పగు\న్ గ\న్ జరగుఁ బ్రభాతము శైల విశ్రమంబున్. |
60 |
| రుచిరము. |
అనంగకోటివిలసదంగవైభవు\న్ మనంబులో నిలిపిన మాను నాపదల్ అన\న్ జభంబులు సజగానుసంగతి\న్ దనర్చు నీరుచిరకు దంతి రాడ్యతిన్. |
61 |
| శక్వరీఛందము: | ||
| వనమయూరము. |
ఉన్నతములై వనమయూర కృతు లోలి\న్ ఎన్నఁగ భజంబులపయి న్సనగగంబుల్ చెన్నొదవ దంతియతిఁ జెంది యలరారన్ వెన్నుని నుతింతురు వివేకు లతిభక్తిని. |
62 |
| వసంత తిలకము. |
గౌరీనితాంతజప కారణనామధేయు\న్ దూరీకృతప్రణతదుష్కృతు నంబుజాక్షు\న్ ధీరోత్తము ల్గిరియతి\న్ తభజాగగ ల్పెం పార న్వసంతతిలకాఖ్య మొనర్తు రొప్పున్. |
63 |
| ప్రహరణ కలిత. |
వనరుహసఖుఁడు\న్ వనరుహరిపుఁడు\న్ గనుఁగవ యగు నాకరి వరదునకు\న్ ననభనలగము న్నగయతిఁ బలుక\న్ బనుపడుఁ గృతులం బ్రహరణకలితన్. |
64 |
| సుందరము. |
కోరిన కోరిక లిచ్చుఁ గోమలి చూడవే మారునితండ్రి యనం గ్రమంబున నీక్రియ\న్ భారసవంబుల నొప్పుఁ బన్నగరాడ్యతి\న్ సూరిజనంబులు సెప్ప సుందరవృత్తముల్. |
65 |
| అపరాజితము. |
మునిజనవినుతుం డమోఘజయోన్నతుం డనితరసదృశుం డనంగ గురుం డనం జను ననయుతమై రసంబు లగంబులై తనరఁగ నపరాజితం బహిరాడ్యతిన్. |
66 |
| అసంబాధ. |
సౌమ్యంబై విష్ణుస్తుతులను నతి సేవ్యంబై రమ్యస్ఫూర్తి\న్ రుద్రవిరమణము రమ్యంబై గమ్యాకారం బొప్పు మతనసగగ ప్రాప్తి\న్ సమ్యగ్భావంబై పొలుపమరు నసంబాధన్. |
67 |
| భూనుతము. |
శ్రీనివాస పురుషోత్తమ సింధువిహారా పూని మమ్ముఁ గృప జేకొని ప్రోవు మనంగా భూనుతంబు రనభాగలఁ బొందిగయుక్తి\న్ పూని సొంపుగ గ్రహాక్షరము\న్ వడినొందన్. |
68 |
| కమల విలసితము. |
నగణము నగణము నగణముఁ జేర\న్ నగణము గగము నొసర నటమీఁద\న్ దిగిభ విరమణము దిరమగునేని\న్ దగుఁ గమలవిలసితము కమలాక్షా! |
69 |
| అతిశక్వరీఛందము: | ||
| మణిగణనికరము. |
కనకపు వలువలుఁ గరకటకములు\న్ నునుపగు తుఱుమును నొసలితిలకము\న్ దనరెడు హరిఁ గని తగననననసల్ నినిచిన మణిగణనికర మిభయతిన్. |
70 |
| మాలిని. |
సకల నిగమవేద్యు\న్ సంసృతి వ్యాధివైద్యు\న్ మకుటవిమలమూర్తి\న్ మాలినీవృత్త పూర్తి\న్ సకలితసమయోక్తి న్నాగవిశ్రాంతియుక్తి\న్ సుకవులు వివరింప\న్ సొంపగున్విస్తరింపన్. |
71 |
| సుకేసరము. |
యతియవతారసంఖ్య నిడి యాదరంబుతో నతిశయమై నజంబులు భజాంతరేఫలు\న్ వితతముగా నొనర్చి యరవిందలోచను\న్ క్షితిధరు సంస్తుతించిన సుకేసరంబగున్. |
72 |
| మణిభూషణము. |
హస్తిరాజభయనిర్హర యండజవాహనా ధ్వస్తసంసరణ యంచుఁ బితామహవిశ్రమ ప్రస్తుతంబుగ రనంబుల భారగణంబుల\న్ విస్తరింప మణిభూషణ వృత్తము చెల్వగున్. |
73 |
| మనోజ్ఞ. |
అజశివశక్రనిరంతరార్చితపద్ద్వయు\న్ భుజగకులాధిపతల్పుఁ బూని నుతింపఁగా నజయతి నొండి నజాభరార్చిత మైచను\న్ ఋజు వగు నుర్వి మనోజ్ఞ ఋష్యనురాగమై. |
74 |
| అష్టిచ్ఛందము: | ||
| ప్రియకాంత. |
అవనియు శ్రీయు న్సతు లజుఁడాత్మోద్భవుఁ డాప్తుల్ దివిజులు దామోదరునకు దేవ ళ్ళిఁ కనేరి సవతు గ నాఁగా నయనయనమ్యక్సగయుక్తి\న్ గవినుతమై దిగ్యతిఁ బ్రియకాంతాకృతి యొప్పున్. |
75 |
| పంచచామరము. |
జరేఫలు\న్ జరేఫలు\న్ జసంయుతంబులై తగ\న్ గురూపరిస్థితిం బొసంగి గుంఫనం బెలర్పఁగా విరించిసంఖ్య నందమైన విశ్రమంబులం దగు\న్ బ్రరూఢమైనఁ బద్మనాభ పంచచామరం బగున్. |
76 |
| పద్మకము. |
నకలితంబు నభజాజగణంబులు గాంతమై సకలదిగ్విరమణంబులు సన్నుతమై చన\న్ శకట దైత్య మదభంజను సన్నుతిసేయఁగాఁ బ్రకటమైకృతులఁ బద్మము పద్మకుఁ బట్టగున్. |
77 |
| ఫలసదనము. |
ననలును ననలును దనరఁగ సగయుక్తి\న్ వనరుహ భవయతు లవహిత మతితోడ\న్ నినుపుచు సుకవులు మణివిలసదురస్కు\న్ గొనకొని పొగడఁగ నగు ఫలసదనంబుల్. |
78 |
| చంద్రశ్రీ. |
జగన్నాథు\న్ లక్ష్మీహృదయ జలజప్రోద్యదర్కు\న్ ఖగాధీశారూఢు\న్ సుకవిజనకల్ప ద్రుమంబు\న్ దగ న్వర్ణింపంగా యమనసయుతంబై రగంబుల్ మొగిం జంద్రశ్రీకి న్నిలుచు యతి ముక్కంటినొందున్. |
79 |
| మేదిని. |
నగణముతో జకారభగణంబుల్ జకార ప్రగుణిత రేఫయు\న్ గురువుభాతిఁగాగ నోలి\న్ దగ నవతార విశ్రమము దండిగా నొనర్ప\న్ మృగమదవర్ణుఁ డీయకొను మేదినీ సమాఖ్యన్. |
80 |
| అత్యష్టిచ్ఛందము: | ||
| నర్కుటము. |
కొలిచెద నందగోపసుతు కోమలపాదముల\న్ దులిచెదఁ బూర్వ సంచితపు దోషములన్ సుఖినై నిలిచెద నన్న నర్కుటము నిర్మల వృత్తమగు\న్ సలలితమై నజంబుల భజావల దిగ్విరతిన్. |
81 |
| శిఖరిణి. |
గజేంద్రాపద్ధ్వంసి\న్ ముదిరసదృశుం గంజనయను\న్ భజింతుం దాత్పర్యంబున ననినచో భాస్కరయతి\న్ ప్రజాహ్లాదం బైన\న్ యమనసభవ ప్రస్ఫురితమై ద్విజశ్రేష్ఠు ల్మెచ్చ\న్ శిఖరిణి గడు\న్ విశ్రుతమగున్. |
82 |
| మందాక్రాంత. |
చెందెం బాదాంబుజరజముచే స్త్రీత్వ మారాతికిం జే యందెం జాపం బిరుతునుకలై యద్భుతం బావహిల్ల\న్ మ్రందె న్మారొడ్డి దశముఖుఁడు\న్ రాముచే నంచుఁ జెప్ప\న్ మందాక్రాంత\న్ మభనతతగా మండితాశా యతుల్గాన్. |
83 |
| పాలాశదళము. |
పదునయిదు లఘువులును బరఁగ గగ మొంద\న్ బదియగునెడ విరతులు బలసి పొడసూప\న్ బొదలి హరినుతులఁగడు దొలుపగుచుఁ బాలా శదళ మనఁబరఁగుఁ గవిజనులు గొనియాడన్. |
84 |
| పృథ్వి. |
జసంబులు జసంబులు\న్ యలగ సంగతి\న్ సాంగమై పొసంగ నమృతాంశుభృద్యతులు పొందఁ బాదంబులై బిసప్రసవలోచనా! వినుము పృథ్వినాఁ బృథ్విలో నసంశయమగున్ భవద్వినుతులందు నింపొందినన్. |
85 |
| హరిణి. |
జరగు నసమప్రోద్యద్రేఫల్ ససంగతమై లగల్ దొరయఁగ మురద్వేషి\న్ సద్భక్తితో వినుతించెద\న్ సరసిరుహగర్భే శానాదిత్యసత్తము నన్నచో హరిణి యనువృత్తం బొప్పారు\న్ బురారి విరామమై. |
86 |
| ధృతిచ్ఛందము: | ||
| మత్తకోకిల. |
ఒక్కచేత సుదర్శనంబును నొక్క చేతను శంఖము\న్ ఒక్కచేతఁ బయోరుహంబును నొక్క చేత గదం దగ\న్ జక్కడంబగుమూర్తికి\న్ రసజాభరంబులు దిగ్యతి\న్ మక్కువందగఁ బాడి రార్యులు మత్తకోకిల వృత్తమున్. |
87 |
| కుసుమితలతావేల్లిత. |
శ్రీనాథు\న్ బ్రహ్మాద్యమరవర సంసేవ్యపాదారవిందు\న్ దీనానాథ వ్రాత భరను గుణోదీర్ణునిం బాడి రోలి\న్ గానారూఢాత్ముల్ మతనయయయల్ కామజిద్విశ్రమంబై వీనుల్ నిండారం గుసుమితలతావేల్లితావృత్తమొప్పున్. |
88 |
| అతిధృతిచ్ఛందము: | ||
| శార్దూలవిక్రీడితము. |
పద్మప్రోద్భవసన్నిభుల్ మసజస ప్రవ్యక్త తాగంబుల\న్ బద్మాప్తాంచితవిశ్రమంబుగ సముత్పాదింతు రుద్యన్మతి\న్ బద్మాక్షాయ నిజాంఘ్రిసంశ్రిత మహాపద్మాయ యోగీంద్ర హృ త్పద్మస్థాయ నమోస్తుతే యనుచు నీశార్దూలవిక్రీడితన్. |
89 |
| తరళము. |
జలరుహాహిత సోదరీ ముఖ చంద్ర చంద్రిక లాదట\న్ గొలఁది మీఱఁగ లోచనంబులఁ గ్రోలి యొప్పు మహాసుఖి\న్ బలుకుచో నభరంబులుం బిదప\న్ సజంబు జగంబులు\న్ జెలువుగా దరళంబునోలి రచింతు రంధకజిద్యతిన్. |
90 |
| మేఘవిస్ఫూర్జితము. |
రమానాథు\న్ నాథు\న్ యదుకుల శిరోరమ్య రత్నాయమాను\న్ సముద్యత్తేజిష్ణు\న్ దనుజయువతిస్ఫారహారాపహారు\న్ మిముం బ్రీతిం బేర్కొం డ్రరుణ విరతి\న్ మేఘ విస్ఫూర్జితాఖ్య\న్ గ్రమంబొప్ప\న్ బెద్దల్ యమనసములు\న్ రాగముల్గా ముకుందా! |
91 |
| భూతిలకము. |
వాఁడె వధూమణి చూడవే ద్రిదివద్రుమంబు ధరిత్రికి\న్ బోఁడిమి దెచ్చిన శూరుఁ డీతనిఁ బోలలే రిల నెవ్వరు\న్ వీఁ డధికుం డని భీమవిశ్రమవృత్తి భూతిలకం బగు\న్ వేఁడి నుతింతురు భారసంబుల వెంట జాగము లొందఁగాన్. |
92 |
| చంద్రకళ. |
వీనులారఁ బ్రసిద్ధపదంబుల్ వేడుకఁ గూర్చి దిశాయతి\న్ గాన వచ్చి రపాతజజంబుల్ గల్గ దిటంబుగఁ జెప్పగ\న్ జానకీవదనాంబుజ శశ్వత్సౌరభలోల మధువ్రతా దానవాంతక చంద్రకళా వృత్తంబు సభం గడు నొప్పగున్. |
93 |
| కృతిచ్ఛందము: | ||
| మత్తేభవిక్రీడితము. |
భవరోగ ప్రవినాశనౌషధకలా ప్రావీణ్యగణ్యుండు శై ల విభేది ప్రముఖాఖిలామరదరోల్లాసుండు గోవిందుఁ డం చు వివేకు ల్సభరంబులు న్నమయవస్తోమంబు గూడ\న్ సమ ర విధిం జెప్పుదురా త్రయోదశయతి న్మత్తేభవిక్రీడితన్. |
94 |
| అంబురుహము. |
తారతుషార పటీర మరాళ సుధాసమాన మహాయశా నీరద భృంగ తమాల దళాసిత నీరజేంద్ర మణిద్యుతీ హార కిరీట ముఖాభరణాంచిత యంచు శ్రీపతిగూర్చి భా భారసవంబుల భాను విరామముఁ బల్క నంబురుహంబగు\న్. |
95 |
| ఉత్పలమాల. |
శ్రీరమణీముఖాంబురుహ సేవన షట్పద నాథ యంచు శృం గార రమేశ యంచు ధృత కౌస్తుభ యంచు భరేఫనంబుల\న్ భారలగంబులుం గదియఁ బల్కుచు నుత్పలమాలికాకృతి\న్ గారవమొప్పఁ జెప్పుదురు కావ్యవిదుల్ యతి తొమ్మిదింటఁగాన్. |
96 |
| ఖచరప్లుతము. |
వరద కేశవ దైత్యవిదారీ వారిజనాభ జగన్నిధీ కరుణఁ జూడుము మమ్ముఁ బ్రసన్నాకార హరీయని పల్కిన\న్ వరుసతో సభభంబు మసావల్ వాలఁగ రుద్రవిరామ మై యరుదుగా మునిపుంగవ వర్ణ్యంబై ఖచరప్లుత మొప్పగన్. |
97 |
| ప్రకృతిచ్ఛందము: | ||
| చంపకమాల. |
త్రిభువనవంద్య గోపయువతీజనసంచితభాగధేయ రుక్ ప్రభవసముత్కరోజ్జ్వల శిరస్స్థిత రత్న మరీచి మంజరీ విభవ సముజ్జ్వలత్పదరవింద ముకుంద యనంగ నొప్పునా జభములు జాజరేఫములుఁ జంపకమాల కగు\న్ దిశాయతిన్. |
98 |
| స్రగ్ధర. |
తెల్లంబై శైలవిశ్రాంతిని మునియతినిం దేజరిల్లు\న్ దృఢంబై చెల్లెం బెల్లై మకారాంచిత రభనయయల్ చెంద మీఁద\న్ యకారం బుల్లం బార\న్ బుధారాధ్యు నురగశయను\న్ యోగివంద్యుం గడు\న్ రం జిల్లం జేయం గవీంద్రుల్ జితదనుజగురం జెప్పుదుర్ స్రగ్ధరాఖ్యన్. |
99 |
| వనమంజరి. |
హరి పురుషోత్తమ కృష్ణ కృపానిధి యాదిమూలమ యంచు నా కరిపతి పల్కఁగఁగాచె నితం డని కౌతుకంబునఁ బల్మరు\న్ జరగుఁ ద్రయోదశవిశ్రమముల్ నజజాజభాంచితరేఫల\న్ మరుగురునిం బ్రణుతింతు రిల\న్ వనమంజరిం గవిపుంగవుల్. |
100 |
| మణిమాల. |
శరణాగతార్తిహర ణాంబుజాతదళ సన్నిభాంబక యుగా కరుణాసముద్ర జగదాదికారుణ పురాణమూర్తి యనుచు\న్ వరుస\న్ సజత్రితయము\న్ ద్రివారమొనరు\న్ సకారము తుది\న్ దిరమొంద దిగ్యతిఁ గవుల్నుతింప మణిమాలవృత్తమరున్. |
101 |
| లాటీవిటము. |
సగణంబులునాల్గిటిపై మతయల్ సమ్యగ్భావంబై యరుదేర\న్ బగలింటికి నేలిక యెవ్వఁడు నా భావింపంగా భాసురభంగి\న్ మిగులన్మధురంబగు శబ్దముల\న్ విశ్రాంతి\న్ లాటీవిటవృత్తం బగునిందుకళాధరసన్నుత నామాంకాశంకాంతంకవిదారీ! |
102 |
| ఆకృతిచ్ఛందము: | ||
| మానిని. |
కొన్నెలపువ్వును గోఱలపాఁగయుఁ గూర్చిన కెంజడ కొప్పునకు\న్ వన్నె యొనర్చిన వాహిని యీతని వామపదంబున వ్రాలె నన\న్ జెన్నుగ నద్రిభసేవ్యగురు న్విలసిల్లు రసత్రయ చిత్రయతుల్ పన్నుగఁ నొందఁ బ్రభాసురవిశ్రమ భంగిగ మానిని భవ్యమగున్. |
103 |
| మహాస్రగ్ధర. |
కొలిచెం బ్రోత్సాహవృత్తిం గుతలగగనముల్ గూడ రెండంఘ్రులం దా బలిఁ బాతాళంబు చేరం బనిచెఁ గడమకై బాపురే వామనుండ స్ఖలితాటోపాఢ్యుఁ డంచుం గరిగిరివిరమాకార మార\న్ నతానో జ్జ్వలసోద్యద్రేఫయుగ్మాశ్రయగురుల మహాస్రగ్ధరం జెప్ప నొప్పున్. |
104 |
| భద్రకము. |
ఆది భఁజేసియవ్వలరనద్వయంబు నొగి మూఁడు తానకముల\న్ బాదుకొనంగ నొక్కగురువొందఁ బైవిరతి రుద్ర సంఖ్య నిడిన\న్ గాదనరాదు భద్రకమునాఁగ గాఢమగువృత్త మొప్పుఁ గృతుల శ్రీదనరార నాశ్రిత వితాన చించిత ఫల ప్రదాన నృహరీ! |
105 |
| వికృతిచ్ఛందము: | ||
| కవిరాజవిరాజితము. |
కమలదళంబులకైవడిఁ జెన్నగు కన్నులు జారుముఖప్రభలు\న్ సమధికవృత్తకుచంబులు నొప్పఁగ శైలరసర్తు విశాలయతి\న్ సముచితనాన్వితషడ్జలగంబుల జానుగఁ బాడిరి చక్రధరు\న్ రమణులు సొంపలరం గవిరాజవిరాజితము\న్ బహురాగములన్. |
106 |
| అశ్వలలితము. |
ఇనవిరమంబున న్నజభజంబులింపుగ భజంబులు\న్ భవములై చనఁ జన నొప్పునశ్వలలితంబు సత్కృతులఁ జెప్పఁగా విశదమై యనుపమవైభవోజ్జ్వల హరీ సహస్రకరదోర్విదారణచణా నినుఁగొనియాడ ధన్యుఁడు గదయ్య నీ కరుణ దాననంత మగుటన్. |
107 |
| పద్మనాభము. |
మున్నెవ్వరు\న్ లేని కాలంబున\న్ సృష్టి మూలంబుగాఁ బద్మగర్భు సృజించె\న్ మున్నీటిలోఁ బాఁపతల్పంబు పై వెన్ను మోపెం ద్రిలోకంబులుం గుక్షి నుండ\న్ ఎన్నంగ నీతం డనాద్యంతుఁ డంచు\న్ నిరీక్షింతు రెవ్వారి వాఁడెల్లనాఁడు\న్ నన్నేలు నా నర్కవిశ్రాంతమై పద్మనాభం బగు\న్ సప్తతంబు ల్గగంటున్. |
108 |
| సంకృతిచ్ఛందము: | ||
| అష్టమూర్తి. |
శ్రీనాథు\న్ సరసిజాక్షు\న్ సితసరోజాతనాభు\న్ జితనిశాటవరేణ్యు\న్ గానోదంచితరసజ్ఞుం గరిభయధ్వాంత భాను\న్ గనకవస్త్రవిలాసు\న్ జానొంద న్మనతయుక్తిన్ సరభజల్ యాంతమై కుంజరయతిద్వయ మొప్పం గా నిట్లం పెసఁగఁ జెప్పెం గవిజనం బష్టమూర్తి\న్ ఘనసమాగమరీతిన్. |
109 |
| సరసిజము. |
మౌళిం బిల్లంగోలొకచేత న్మఱియొక కరమున మణిమయలతయు\న్ బాలశ్రేణుల్మ్రోల వసింప\న్ బసులనొదిగి చనుపసగల ప్రభువు\న్ జాలం గొల్వంజాలినకోర్కుల్ సఫలములగు ననసరసిజమమరు\న్ బోల\న్ బ్రహ్మవ్యాళవిరామ స్ఫురదురుమతయనములు నననసలు\న్. |
110 |
| క్రౌంచపదము. |
కాంచనభూషాసంచయ మొప్ప\న్ ఘనకుచభరమునఁ గవు నసియాడ\న్ జంచలనేత్ర ల్వంచనతోడ\న్ సముచితగతి వెనుచని తనుఁగొల్వ\న్ అంచితలీల న్మించినశౌరి\న్ హరిదిభపరిమితయతు లొనఁగూడ\న్ ముంచి రచింపం గ్రౌంచపదం బిమ్మొగి భమసభననముల నయలొందున్. |
111 |
| అతికృతిచ్ఛందము: | ||
| బంధురము. |
ఋభువులు దితితనయులు సమబలులై యెంతయు మత్సరము ల్బెరయ\న్ రభస మలరఁ గలశనిధిఁ దఱవఁగం గ్రక్కునఁ గవ్వపుఁగొండకు నీ ప్రభు వనువుగఁ గుదురుగ నిలిచె ననం బంచదశాక్షరవిస్రమమై ప్రబ మిగులఁగ ననననసభభభగల్ బంధుర వృత్తము చెప్పఁదగున్. |
112 |
| భాస్కర విలసితము. |
గోపనికరముల నేలినవాని\న్ గోవృషదనుజుల నడఁచినవాని\న్ గోపికలను బ్రమయించినవాని\న్ గుబ్జకు విలసన మొసఁగినవాని\న్ గోపకులము వెలయించినవాని\న్ గొల్చెద మని బుధు లినయతిఁ బల్క\న్ బ్రాపుగ భనజయభాశ్రిత నాసల్ భాస్కర విలసితమగు గురుయుక్తిన్. |
113 |
| ఉత్కృతిచ్ఛందము: | ||
| భుజంగ విజృంభిత. |
స్వారాజారి వ్రాతారాతీశశిపనసమనయన సర్వదా మునివందితా గౌరీశాద్యామర్త్యస్తుత్యా కమలభవజనక మధు కైటభాసురమర్దనా శ్రీరామాహృత్స్వామీ యంచు\న్ జెలఁగి మమతనననలఁ జెంద రేఫసలు\న్ లగ\న్ ఘోరాఘౌషూభిద్వేషిం బేర్కొనఁగ వసుదశయతియగు\న్ భుజంగవిజృంభిత\న్. |
114 |
| మంగళమహాశ్రీ. |
చిత్తములఁ జూపులను జిత్తజుని తండ్రిపయిఁ జెంది గజదంతియతు లొంద\న్ నృత్తములతోడఁ దరుణీమణులు గానరుచు లింపుగను మంగళమహాశ్రీ వృత్తములఁ బాడిరి సవృత్తకుచకుంభముల వింతజిగి యెంతయుఁ దలిర్ప\న్ మత్తిలుచు నబ్భజసనంబు లిరుచోటులఁ దనర్పఁగఁ దుద\న్ గగ మెలర్పన్. |
115 |
| అసమవృత్త భేదములు | ||
| వ. | మఱియు నర్థసమవృత్త విషమ వృత్తంబు లెట్టి వనిన. | 116 |
| క. |
ధరనొకటియు మూఁడును నగు చరణంబులు మఱిద్వితీయ చాతుర్థిక వి స్ఫురితాంఘ్రులుఁ దమలోనను సరి యగునర్థసమవృత్తచయమునఁ గృష్ణా! |
117 |
| గీ. |
జరగునందు స్వస్థానార్థసమ మనంగ ఛంద మొకటన నిట్టిలక్షణముదగుల నమరుఁ నట పరస్థానార్థసమము నాఁగ నెలమిఁ దరువాతి ఛందంబు గలయఁ గృష్ణ. |
118 |
| సీ. |
విషమ వృత్తంబులు వెలయు బాదంబుల గణములు వేర్వేఱుగా నొనర్ప నవియు స్వస్థానంబు నటపరస్థానంబు సర్వపరస్థానసంజ్ఞికంబు నొక్క ఛందంబున నొగిఁ గొని పాదముల్ వేఱైన స్వస్థానవిషమ మయ్యె నొకపాద మొక్కట నున్న పాదంబులు క్రిందటి ఛందంబునందు నైన |
|
| తే. |
మీఁది చందంబునందైన మెఱయఁ జెప్ప నవి పరస్థాన విషయ వృత్తాహ్వయములు వెండి సర్వపరస్థాన విషమమునకు నన్నియునుఁ జెప్ప ఛందంబు లబ్జనాభ. |
119 |
| స్వస్థానార్థసమవృత్తములు: | ||
| నారీప్లుతము. |
క్షీరోదన్వన్మధ్యగేహ మతాగా సారంబు నుద్యత్తతజ ల్గగంబు\న్ బూరింపంగాఁ బాదముల్ రెంట రెంట\న్ నారీప్లుతం బయ్యె ననంతమూర్తీ! |
120 |
| పరస్థానార్థసమవృత్తములు: | ||
| మనోహరము. |
క్ష్మారాజ రమేశ జతావము లు ద్ధుర మైనసకారచతుష్కముతోఁ గూరంగ సగంబులు గూడి మనో హరవృత్తము చెల్వగు నద్రిధరా! |
121 |
| స్వస్థానవిషమవృత్తములు: | ||
| అంగజాస్త్రము. |
భూరిభమంబుల్ పొందు సగం బిం పారఁగ నర్థంబై యటసాము\న్ శౌరీ విన్మసజంబు గాంతమై యారూఢం బగు నంగజాస్త్రమున్. |
122 |
| వరాంగి. |
సరిత్పదాబ్జా జతజల్ గగల్ బం ధురం బగు\న్ రెంట జతుర్థకాంఘ్రి\న్ గారాముతోఁ దాజగగల్ వరాంగి\న్ హరార్చితా మూఁడవయంఘ్రి నొందున్. |
123 |
| నదీప్రఘోషము. |
నాగతల్పా మొద ల్నాల్గు రేఫంబులు\న్ జగన్నివాసా జతజంబు రేఫయు\న్ దగంగ నమ్మూఁడు పదంబులందు జా తిగాఁ బ్రవర్తించు నదీ ప్రఘోషకు\న్. |
124 |
| పరస్థానవిషమవృత్తములు: | ||
| శ్రీరమణము. |
ధాత్రి భమంబుల్ తత్సగ మాది\న్ భత్రయగాగణపద్ధతి మూఁట\న్ గోత్రధరా యిటు గూర్పఁ బదంబుల్ చిత్రగతిం జను శ్రీరమణంబుల్. |
125 |
| రథగమన మనోహరము. |
రథగమన మనోహరంబు రెండవఘ్రి\న్ ప్రథితం బగు\న్ సజజంబు రప్రయుక్తయంబు\న్ ప్రథమపదమునందుఁ బైసగంబునందు\న్ గథితననరజంబు గద్వయంబుఁ గృష్ణా! |
126 |
| సర్వపరస్థానవిషమవృత్తములు: | ||
| వీణారచనము. |
వీణారచనం బయ్యె భువి\న్ తయసాగల్ బాణప్రహరా తజనభభవ్యగగంబుల్ చాణూరహరా తజనభస ల్ప్రకటయతిన్ వేణుధర భననభసవిశ్రుత మగుచున్. |
127 |
| పంచపాది (సమవృత్తము): | ||
| క. |
పాదచతుర్వృత్తంబున నాదరమునఁ బంచపాది యనుసమవృత్తం బైదవపదంబు గలిగిన మాదయితా కృతులయందు మహనీయ మగున్. |
128 |
| ఉ. |
శ్రీసతిఁ బేరురంబున ధరించినభోగి చతుర్ముఖుండు నా భీసరసీరుహంబునకు బిడ్డఁడుగా విలసిల్లి మేటి కై లాసనగాలయుండు జడల\న్ సవరించినయేటిపుట్టినిల్ భాసురపాదపద్మ మగుబల్లిదుఁ డివ్విభుఁ డంచు సన్నుతుల్ సేసిరి సన్మునీంద్రు లనఁ జెన్నగువృత్తము పంచపాదియై. |
129 |
| ఉద్ధురమాలా వృత్తములు | ||
| క. |
పరఁగఁగ నిఱువదియాఱ క్షరములకును నధిక మగుచుఁ జరణంబుల ను ద్ధురమాలావృత్తంబులు జరగు లయగ్రాహి మొదలు జలరుహనాభా! |
130 |
| లయగ్రాహి. |
ఎందు నిల దేజనులకుం దలఁపరానితప - మందికొనిచేసిరొకొ నందుఁడు యశోదా సుందరియుఁ బూర్ణనిధిఁ బొందిరి కడుందొరసి - పొందగునుముప్పుతఱి నందనునిగా శ్రీ మందిరుని నంచు నిటు లందముగఁ బ్రాసములు - గ్రందుకొని చెప్పుమునిబృందము లయగ్రా హిం దనర నబ్భజసలుం దగ నకారమును - బొంద నిరుచోట్లని బిఱుంద భయ లొందన్. |
131 |
| లయవిభాతి. |
పడయరె తనూభవులఁ బడయుదురు గాక పెర - పడఁతులును భర్తలను బడసిరె తలంప\న్ బుడమి నలనందుఁడును బడఁతుక యశోదయును - గడుపున జగత్త్రయము నిడికొనిన పుత్రు\న్ బడసిరఁట యంచు బెడఁ గడరునసనత్రివృతి - గడనసగముల్ పొసఁగ నిడ లయవిభాతి\న్ నొడువుదురు సత్కవు లెపుడును విరితేనియలు - వడియు పగిదిన్ రసము కడలుకొనుచుండన్. |
132 |
| లయహారి. |
చదువులును గిదువులను జదువ ధన మొదవు నని - మదిఁ దలఁపవలదు మును చదివిరె ధరిత్రి\న్ సదమలినహృదయుఁ డనఁ బొదలు దితిసుతసుతుఁడు - మొదలఁ బలికినపలుకు జదువఁగ ముకుందుం డద నెఱిగిఁ కదిసెఁ గద! చదివినభృగువుకొడుకు - చదువుతుది నొకపనికి నొదవెనె యటంచున్ పదునొకఁడు నగణములు గదిసి సగమెనయ భువి - విదితముగ బుధులు పలుకుదురు లయహారిన్. |
133 |
| త్రిభంగి. |
నననన ననసస లును భమసగలును - దనరి నటింపఁ గణంక\న్ నలువంక\న్ బెంపుదొలంక\న్ మునుకొని నఖముఖమున వెడఁగదలుపఁ - జనుఁ గడునొప్పగువీణల్ నెరజాణల్ వేలుపుగాణల్ వనరుహ జనితుని తనయులు మొదలుగ - ఘనమతులాదటతోడ\న్ శ్రుతిగూడ\న్ వెన్నునిఁబాడ\న్ వినఁగలిగిన నదిజననము ఫలమని - మునిజను లిందు శుభాంగు\న్ దగుభంగి\న్ జెప్పుఁ ద్రిభంగిన్. |
134 |
| దండకము. |
సిరి నేలు రసికుండు శ్రీవత్సవక్షుండు నీరేరుహాక్షుండు నిత్యాసదృక్షుండు త్రైలోక్య సంరక్షణోపాయ దక్షుండు మాపాలి దేవుండు ధీరుం డుదారం డితం డిచ్చు మాయిచ్చకు న్వచ్చు సౌఖ్యమ్ము లంచు న్మదిం గోరి పెద్దల్ స కారంబుతో సంగతం బై నహం బాది నొండె\న్ దకారాదిగా నైన; లో నెల్ల చోట\న్ దకారంబులం బెల్లు చెంద\న్ గకారావసానంబు నై దండకాకార మేపారఁ గీర్తింతు రెల్ల ప్పుడున్. |
135 |
| గద్యము. |
ఇది శ్రీవాణీవరప్రసాదలబ్ధవాగ్విభవ తిక్కనామాత్య తనుసంభవ సుకవిజనవిధేయ అనంతనామధేయ ప్రణీతం బైన ఛందోదర్పణంబునందు నుభయభాషానురూపంబు లగు గద్యపద్యంబుల విధంబును షడ్వింశతి చ్ఛందోనామంబులును, తదుద్భవంబు లగు సమ వృత్తంబులును, వృత్తమిశ్రంబు లగు నర్థసమవిషమ వృత్తంబులును, ఛందోఽతిరిక్తంబు లగు మాలా వృత్తంబులును, తద్భేదం బగు దండకంబు నన్నది ద్వితీయాశ్వాసము. |
|